అందరూ అనుకున్నట్టు అది ‘ఆర్.ఆర్.ఆర్’ పిక్ కాదు..!

  • April 4, 2019 / 06:35 PM IST

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు,దర్శకుడు అయిన సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్తుడే. ధనుష్ ‘రఘువరన్‌ బీటెక్‌’ చిత్రంలో హీరోకు తండ్రిగా, విశాల్ ‘జయసూర్య’ చిత్రంలో అన్నగా, రజినీకాంత్ ‘కాలా’ చిత్రంలో బావ బావ అంటూ తిరిగే బావమరిదిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులని అలరించాడు. అంతేకాదు రవితేజ, అల్లరినరేష్ ల ‘శంభో శివ శంభో’ చిత్రానికి కూడా దర్శకుడు ఈయనే..! ప్రస్తుతం రాజమౌళి డైరెక్టర్ గా చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రాజమౌళితో కలిసి సముద్రఖని దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ ఫొటో చూసిన వారందరూ ఇది ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్‌లో తీసిన ఫోటో అనుకుంటున్నారట. కానీ ఇది ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్లో తీసిన ఫోటో కాదు… రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మిస్తున్న ‘ఆకాశవాణి’ చిత్రంలోనిది. ఈ చిత్రంలో కూడా సముద్రఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చరణ్‌ కి గాయమవ్వడం కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో రాజమౌళి.. ‘ఆకాశవాణి’ షూటింగ్ స్పాట్‌కు వెళ్ళాడు. ఇక ఆ షూటింగ్లో పాల్గొంటున్న సముద్రఖని కూడా అక్కడే ఉండడంతో… జక్కన్న ఓ ఫొటో దిగి తన సోషల్‌ మీడియాలో చేసాడు. ఈ ఫొటోలో సముద్రఖని లుక్‌ కూడా అప్పటికాలానికి చెందినది లానే ఉంది.. దీనిని బట్టి చూస్తే ‘ఆకాశవాణి’ చిత్రం కూడా పీరియాడిక్‌ నేపథ్యంలో రూపొందే చిత్రంలానే ఉంది. ఇక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం మూడు వారల తర్వాత తిరిగి ప్రారంభం కానుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus