Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

నిజమే ఇండస్ట్రీ అంతా ఊరికే చెప్పలేదు. కృష్ణ గారు ‘డేరింగ్ అండ్ డాషింగ్’ కి డెఫినిషన్ అని..! టాలీవుడ్లో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన… తర్వాత నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.56 ఏళ్ల నట ప్రస్థానంలో కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈస్ట్‌మన్‌ కలర్‌,కౌబాయ్ జోనర్,ఫస్ట్ సినిమా స్కోప్, 70 ఎం ఎం, ‘స్పై’ జోనర్, ‘సస్పెన్స్’ థ్రిల్లర్…. ఇలా ఎన్నో జోనర్ లను టాలీవుడ్ కు పరిచయం చేసి.. మూస ధోరణిలో వెళ్తున్న టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేశారు ఈయన. టాలీవుడ్ సినిమా గురించి హాలీవుడ్లో కూడా మాట్లాడుకునేలా చేసిన వారిలో కృష్ణ కూడా ఒకరు. ఆయన టాలీవుడ్ కు అసలైన ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1965 లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్లో రూపొందిన తొలి ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ మూవీ.

2) 1971 లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు చిత్రంతో టాలీవుడ్ కు కౌబాయ్ జోనర్ ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. కె.ఎస్.ఆర్ దాస్ ఈ చిత్రానికి దర్శకుడు. కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు ఈ చిత్రానికి నిర్మాత.

3) 1974 వ సంవత్సరంలో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో టాలీవుడ్ కు ఫస్ట్ సినిమా స్కోప్ ను పరిచయం చేశారు.

4) 1986 వ సంవత్సరంలో వచ్చిన ‘సింహాసనం’ చిత్రంతో 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ ఫిలిం ను టాలీవుడ్ కు అందించారు.




5) 1995 వ సంవత్సరంలో వచ్చిన ‘తెలుగు వీర లేవర’ చిత్రంతో ఫస్ట్ డీటీఎస్ చిత్రాన్ని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు.




6) 1966 వ సంవత్సరంలో వచ్చిన ‘గూఢచారి 116’ తో టాలీవుడ్ కు ‘స్పై’ జోనర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత 1971 లో వచ్చిన ‘జేమ్స్ బాండ్’ చిత్రంతో కూడా ఆ హవాని కంటిన్యూ చేశారు.




7) 1967 వ సంవత్సరంలో వచ్చిన ‘అవే కళ్ళు’ చిత్రంతో టాలీవుడ్ కు మర్డర్ మిస్టరీ జోనర్ ను పరిచయం చేశారు.




8) 1986 వ సంవత్సరంలో వచ్చిన ‘సింహాసనం’ చిత్రానికి నిర్మాతగా, డైరెక్టర్, హీరోగా, ఎడిటర్ గా కూడా వ్యవహరించారు కృష్ణ. ఇదే మూవీతో ఆయన టాలీవుడ్ కు బప్పీ లహరి అనే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ను పరిచయం చేశారు.




9) 1967 వ సంవత్సరంలో వచ్చిన ‘సాక్షి’ మూవీ ఓ ఆఫ్ బీట్ మూవీగా రూపొందినప్పటికీ మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయిన తొలి తెలుగు మూవీగా రికార్డులకెక్కింది.





10) 2004 వ సంవత్సరంలో వచ్చిన ‘శాంతి సందేశం’ అనే సినిమాలో కృష్ణ… యేసు క్రీస్తు పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలు ఎవ్వరూ ఇలాంటి జోనర్ మూవీ చేయలేదు. కృష్ణ ఒక్కరే ఇలాంటి మూవీ చేశారు.





Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus