Balakrishna: బాలయ్య ఆ రూల్స్ పాటించడం వెనుక అసలు కథ ఇదేనా?

  • June 26, 2024 / 09:35 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత లేకపోయినా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాల షూటింగ్స్ వేగంగానే పూర్తవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

100 రోజుల కంటే తక్కువ సమయంలోనే బాలయ్య సినిమాల షూటింగ్స్ పూర్తైన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆదిత్య 369 (Aditya 369) మూవీ షూటింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల షూట్ ఆలస్యం కానుందని మీరు కూడా షూటింగ్ కు ఆలస్యంగా హాజరు కావాలని యూనిట్ నుంచి సమాచారం అందింది. ఆరోజు బాలయ్య ఇంట్లో కనిపించడంతో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధిన షూట్ ఉన్నా లేకపోయినా షూటింగ్ జరుగుతుందంటే సెట్ లో ఉండాలని సూచించారట.

అప్పటినుంచి బాలయ్య మాత్రం ఎన్టీఆర్ చెప్పిన రూల్స్ ను ఫాలో అవుతూ వచ్చారట. బాలయ్య ఇప్పటికీ షూటింగ్ జరుగుతుందంటే సెట్ కు వెళ్లి డెడికేషన్ తో షూట్ అయ్యేవరకు అక్కడే ఉంటారని సమాచారం. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 130 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించే కథలపై ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. బాలయ్య భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అఖండ సీక్వెల్ షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus