Buddy Trailer Review: అల్లు శిరీష్ ‘బడ్డీ’ ట్రైలర్ … గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో ‘బడ్డీ’ (Buddy) అనే సినిమా రూపొందింది. సామ్ అంటోన్ (Sam Anton) డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో రూపొందిన ‘టెడ్డీ’ అనే సినిమాకి రీమేక్. ఆర్య (Arya) , సాయేషా (Sayyesha Saigal) .. హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. ‘స్టార్ మా’ లో 2,3 సార్లు టెలికాస్ట్ అయ్యింది కూడా..! అయితే కొన్ని కీలక మార్పులతో తెలుగులో అల్లు శిరీష్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఒరిజినల్ ని నిర్మించిన జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ఈ రీమేక్ ను కూడా నిర్మించడం జరిగింది.

జూలై 26 న ‘బడ్డీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ ను వదిలారు. ‘చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు అన్యాయం జరిగినా.. ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు…కానీ అన్యాయం పై తిరగబడ్డ టెడ్డి బేర్ ని చూశారా? చూస్తారా?’ అంటూ సాయి కుమార్ (Sai Kumar) వాయిస్ ఓవర్లో ఈ ట్రైలర్ మొదలైంది. అల్లు శిరీష్ (Allu Sirish) ఈ సినిమాలో పైలెట్ ఆదిత్య రామ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొదట్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ను చూపించారు.

ఆ తర్వాత టెడ్డి బేర్ ఆదిత్య జీవితంలోకి రావడం.. ఆ తర్వాత వచ్చే ఫన్నీ ఇన్సిడెంట్స్ ని చూపించారు. విలన్(అజ్మల్(Ajmal Ameer) వల్ల కోమాలోకి హీరోయిన్ ఆత్మ టెడ్డీలోకి వచ్చి ఎలా రివేంజ్ తీర్చుకుంది. ఆ టెడ్డీకి హీరో ఎలా సాయపడ్డాడు అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో ‘ఇంకా ఎన్ని సార్లు వస్తావురా?’ అంటూ అల్లు శిరీష్ ని విలన్ ప్రశ్నిస్తే..’గెలిచే వరకు’ అంటూ శిరీష్ చెప్పే డైలాగ్ అతని రియల్ లైఫ్ కి దగ్గరగా అనిపిస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus