1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ (Kamal Haasan) -దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఆ టైంలో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) రూపొందింది. కమల్ హాసన్ తో పాటు సిద్దార్థ్ (Siddharth) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ఎస్.జె.సూర్య (S. J. Suryah), బాబీ సింహా (Bobby Simha) వంటి స్టార్స్ కూడా నటించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్ సినిమా పై అంచనాలు పెంచాయి. జూలై 12 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 2 :37 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్లో.. ‘ప్రస్తుతం సమాజం ఎలా ఉంది? ఉద్యోగ అవకాశాలు లేక యువత ఎలా ఇబ్బందులు పడుతుంది.ఉద్యోగం చేసే వారికి జీతం కంటే టాక్సుల రూపంలో పోయేదే ఎక్కువగా ఉంటుంది’…వంటి అంశాలను హైలెట్ చేస్తూ టీజర్ ను వదిలారు.
ఇలాంటి ఇబ్బందులు సేనాపతి మనవడు కూడా అనుభవిస్తాడు. ఆ పాత్రలో సిద్దార్థ్ నటిస్తున్నాడు. అతనితో పాటు యువత మొత్తం ‘భారతీయుడు’ మళ్ళీ రావాలని టెక్నాలజీని వాడుకుని ఏం చేశారు? భారతీయుడు వచ్చి ఎలాంటి అద్భుతాలు చేశాడు?’ అనేది ఈ ‘భారతీయుడు 2 ‘ కథాంశంగా తెలుస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే కథ పరంగానే.. బాగానే ఉన్నా, కమల్ హాసన్.. శంకర్..ల నుండి ఆశించే వైవిధ్యం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ‘గజిబిజి..గజిబిజిగా..’ ఈ ట్రైలర్ సాగింది. మీరు కూడా ఓ లుక్కేయండి :