Kalki 2898 AD Trailer Review: కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ (Nag Ashwin)  డైరెక్ట్ చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ (C. Aswani Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) , స్వప్న దత్ (Swapna Dutt).. లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 27న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషించారు.

కమల్ హాసన్ (Kamal Haasan) ఈ చిత్రంలో విలన్ గా నటించడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈరోజు ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ట్రైలర్ 3 నిమిషాల నిడివి కలిగి ఉంది. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత అశ్వద్దామగా అమితాబ్ ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత అశ్వద్దామ కల్కి పాత్రని పరిచయం చేసినట్టు చూపించారు.

‘రికార్డ్స్ చెక్ చేసుకో .. ఇప్పటివరకు నేను ఏ ఫైట్ ఓడిపోలేదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ప్రభాస్ కంటే అమితాబ్ రోల్ కే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చారు. అలా అని ప్రభాస్ ను తగ్గించలేదు. సినిమా కోసం దాచి ఉంచారేమో. ఇక ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ గెటప్ అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి:

 

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus