Brahmanandam, Allu Arjun: అల్లు అర్జున్ ను బ్రహ్మానందం కలవడానికి కారణం అదేనా..!

  • August 26, 2023 / 01:40 PM IST

జాతీయ 69వ అవార్డులు టాలీవుడ్ చెంతకు చేరాయి..మునుపెన్నడు లేని విధంగా తెలుగు పరిశ్రమంగా ఏకంగా 10 నేషనల్ అవార్డులు వచ్చాయి.. అందులో పుష్ప సినిమాకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు వచ్చిన విషయం అందరికి తెలిసిందే..అయితే అవార్డు వచ్చిన అల్లు అర్జున్ అందరిని అశ్చర్యపరుస్తూ స్టార్ కమెడియన్ బ్రహానందం ఇంటికి వెళ్లారు..ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్‌ వివాహం డాక్టర్ ఐశ్వర్యతో లాస్ట్ వీక్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అల్లు అర్జున్ బిజీగా ఉండటం వల్ల అటెండ్ కాలేకపోయారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తాజాగా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి నూతన వధూవరులను పలకరించారు. 69వ జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు సాధించారు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ..తన ఇంట్లో అల్లు అర్జున్ ని సన్మానించారు.

దీంతో (Allu Arjun) అల్లు అర్జున్తో దిగిన బ్రహ్మీ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మనందం కొడుకు -కోడలుతో ఉన్న అల్లు అర్జున్ పిక్స్ క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి. నేషనల్ స్టార్తో..బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ అల్లు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దాదాపు 2 గంటల పాటు బ్రహ్మీ ఫ్యామిలీతో అల్లు అర్జున్ టైం స్పెండ్ చేశారు. ఇక గత వారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్‌చరణ్‌, మోహన్‌ బాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై హాజరై వధూవరులను ఆశీర్వ


దించిన సంగతి తెలిసిందే.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus