Chiranjeevi: చిరంజీవి రెమ్యునరేషన్‎ తగ్గించడానికి కారణం ఆ సినిమానేనా..!

ఇటీవల చిరంజీవి తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఆయన దాదాపు అన్నీ రీమేక్ సినిమాలే తీస్తున్నారు. తాజాగా వచ్చిన భోళా శంకర్ సినిమా కూడా రీమేకే. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కనీసం మెగా అభిమానులను కూడా ఆకట్టుకోలేక చతికిల పడిపోయింది. ఆచార్య సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా చిరంజీవి ఖాతాలో చేరింది.

అవకాశాల్లేక వెనుకబడ్డ మెహర్ రమేష్‎ను నిలబెట్టాలని చిరు చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్ గా తెలుగులో వచ్చిన భోళా శంకర్ సినిమా ఏ కోణంలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చిరుకి చెడ్డపేరుతో పాటు నిర్మాత అనిల్ సుంకరకు కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు.. అసలే ఏజెంట్ నష్టాలతో దిగులుపడుతున్న అనిల్ సుంకరను భోళా శంకర్ సినిమా కోలుకోలేని దెబ్బతీసింది.

భోళా ఎఫెక్ట్ ప్రస్తుతం చిరు (Chiranjeevi) రెమ్యూనరేషన్ మీద పడింది. నిజానికి ప్రతి సినిమాకి చిరంజీవి రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు చార్జ్ చేస్తుంటారు. సినిమా బడ్జెట్ రూ.100 నుంచి రూ.120 కోట్లు అవుతూ ఉండేది. అయితే బిజినెస్ మాత్రం రూ.100 కోట్లు దాటకపోవడంతో నిర్మాతలకి టెన్షన్ పట్టుకుంది. చిరు వరుస రీమేక్స్ చేయడం కూడ మైనస్ అయిందని చెప్పవచ్చు.

మెగాస్టార్ ఇక పై నటించే సినిమాలకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం లేనట్లు తెలుస్తోంది. చిరంజీవికి రూ.30 నుంచి రూ.35 కోట్లు మాత్రమే ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాగోలేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ప్రేక్షకులు సినిమా థియేటర్ వైపు కూడా కన్నెత్తి చూడరని భోళా శంకర్ సినిమాను చూస్తే అర్థం అవుతోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus