Pooja Hegde: పూజా హెగ్డే సర్జరీ చేయించుకున్నారా… అందుకే సినిమాలకు దూరమయ్యారా?

  • August 28, 2023 / 07:54 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అదేవిధంగా ఈమె కమిట్ అయిన సినిమాల నుంచి కూడా తప్పుకుంటున్నారు. ఇలా పూజ హెగ్డే సినిమాలకు కమిట్ అవుతూ తప్పుకోవడానికి కారణం ఏంటి అన్న అయోమయంలో అభిమానులు ఉన్నారు. ఇలా పూజా హెగ్డే సినిమాలకు దూరమవుతున్నటువంటి తరుణంలో ఈమె కెరియర్ గురించి అభిమానులలో కూడా ఆందోళన మొదలైంది

అయితే పూజా హెగ్డే ఇలా సినిమాలకు కమిట్ అవుతూ తప్పుకోవడానికి కారణం కూడా ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఆమెకు కాలు సర్జరీ జరిగిందని తెలుస్తోంది. గతంలో ఓసారి ఈమె కాలు ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి తనకు కాలు విపరీతమైన నొప్పి ఉండడం చేత సర్జరీ చేయించుకున్నారని సమాచారం.

ఇలా మేజర్ సర్జరీ కావడంతో ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.అయితే సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కాలు విపరీతమైన నొప్పి రావడం వల్ల ఆమె సినిమాల నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇలా సినిమాల నుంచి తప్పుకున్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం సర్జరీ చేయించుకున్నారని అందుకే ఇన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మరి పూజా హెగ్డే (Pooja Hegde) గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే ఈమె కాలు సర్జరీ జరిగినప్పటికీ పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతుండడంతో ఈమె గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందని అభిమానులు ఆరా తీస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus