Krithi Shetty: టాలీవుడ్ స్టార్స్ కృతిని అందుకే దూరం పెట్టారా?

  • June 7, 2022 / 08:01 PM IST

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న కృతిశెట్టికి తమిళంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ కు జోడీగా కృతిశెట్టి ఎంపికయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కృతిశెట్టిని పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా కృతికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, బన్నీ, పవన్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం మాత్రం కృతిశెట్టికి దక్కడం లేదు.

కృతిశెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేస్తే వయస్సు విషయంలో డిఫరెన్స్ కనిపిస్తుందని నెగిటివ్ కామెంట్లు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ ఈ విధంగా భావిస్తున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్స్ ఛాన్స్ ఇవ్వకపోతే కృతి టాలీవుడ్ లో దశాబ్దాల పాటు కెరీర్ ను కొనసాగించడం కష్టమేనని చెప్పవచ్చు. చిన్న వయస్సులోనే కృతిశెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా సినిమాల ద్వారా కృతిశెట్టి మరింత సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఒక్కో సినిమాకు కృతిశెట్టి కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటున్న కృతిశెట్టి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. కృతిశెట్టి ప్రస్తుతం ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో కృతిశెట్టి డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సినిమాసినిమాకు కృతిశెట్టికి క్రేజ్ పెరుగుతుండగా కృతిశెట్టి కెరీర్ విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, ఇతర భాషల నుంచి కూడా కృతిశెట్టికి సినిమా ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. చిన్న వయస్సులోనే ఊహించని స్థాయిలో కృతి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus