NBK109: బాలయ్య బాబీ మూవీ రిలీజ్ డేట్ సైలెన్స్ వెనుక రీజన్స్ ఇవేనా?

  • March 9, 2024 / 02:54 PM IST

బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. బాలయ్య ఫ్యాన్స్ ఆయన సినిమాల నుంచి ఏం ఆశిస్తారో అదే విధంగా ఈ గ్లింప్స్ ఉంది. ఈ గ్లింప్స్ కు యూట్యూబ్ లో దాదాపుగా 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో యూట్యూబ్ లో నంబర్ 1 గా ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. బాలయ్యను పవర్ ఫుల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

అయితే గ్లింప్స్ లో రిలీజ్ డేట్ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ గురించి సైతం అధికారికంగా క్లారిటీ రాలేదు. అయితే రిలీజ్ కు చాలా సమయం ఉండటం వల్లే రిలీజ్ డేట్ గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదని ప్రధానంగా తెలుస్తోంది. బాలయ్య కొంతకాలం పాటు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.

మరోవైపు థమన్ వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వరుసగా పని చేస్తున్నారు. (NBK109) ఎన్బీకే 109 గ్లింప్స్ కు బాలయ్య అదిరిపోయే బీజీఎం ఇచ్చారు. బాలయ్య థమన్ (SS Thaman) కాంబినేషన్ స్పెషల్ కాంబినేషన్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. థమన్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో తెలియాల్సి ఉంది.

బాలయ్య సినిమాకు పని చేయడానికి వచ్చిన అవకాశాన్ని బాబీ సద్వినియోగం చేసుకున్నారని గ్లింప్స్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. సితార నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ మూవీని పండుగ సమయంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus