Tamanna: ఆ తప్పే తమన్నా కెరీర్ కు మైనస్ అయిందా?

  • October 1, 2022 / 01:51 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమన్నా సక్సెస్ రేట్ మాత్రం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో తగ్గింది. తమన్నా స్టార్ హీరోలతో కలిసి నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఊసరవెల్లి, ఆగడు, బద్రీనాథ్, రెబల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలిసిందే. కథల ఎంపికలో తమన్నా చేస్తున్న తప్పులే ఆమె ఫ్లాపులకు కారణమని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బాహుబలి, బాహుబలి2, ఎఫ్2 సినిమాలు మినహా ఈ మధ్య కాలంలో తమన్నా నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. ప్రతిభ ఉన్న నటి కావడంతో తమన్నాకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. పలు టీవీ షోలకు తమన్నా హోస్ట్ గా వ్యవహరించినా ఆ షోలు కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. స్టార్ హీరోల ప్రాజెక్ట్ లలో ఆఫర్లు రాకపోవడంతో తమన్నా ప్రస్తుతం చిన్న హీరోలతో కలిసి నటించడానికి కూడా ఓకే చెబుతున్నారు.

బాలీవుడ్ లో తమన్నా నటించిన హిమ్మత్ వాలా సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. కొన్నిరోజుల క్రితం తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటించగా ఆ వెబ్ సిరీస్ కూడా ఫ్లాపైంది.

తనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను తమన్నా నిలబెట్టుకోలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లపై తమన్నా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తర్వాత ప్రాజెక్ట్ లతో తమన్నా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమన్నా ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus