మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే అటు చైతన్య నుంచి కానీ ఇటు నిహారిక నుంచి కానీ ఈ వార్తల గురించి ఎలాంటి స్పందన లేదు. అయితే వీళ్లిద్దరు స్పందించకపోవడంతో వీళ్లిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. నిహారిక పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్లే వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని టాక్ నడుస్తోంది. మరోవైపు వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించాలని చైతన్య భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిహారిక చైతన్య మధ్య విభేదాలకు సంబంధించి చిరంజీవి జోక్యం చేసుకోనున్నారని చిరంజీవి మాటను ఇద్దరూ గౌరవిస్తే మాత్రం వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు పరిష్కారం అవుతాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ జోడీ మధ్య ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
నిహారిక చైతన్య సమస్యలను పరిష్కరించుకుని సంతోషంగా జీవనం సాగించాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. ప్రతి జంట మధ్య చిన్నచిన్న గొడవలు, సమస్యలు కామన్ అని అంత మాత్రాన విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్లు సూచిస్తున్నారు.
నిహారిక నటిగా కెరీర్ ను కొనసాగించాలని కొంతమంది సూచనలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. నిహారిక యాంకర్ గా కూడా ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిహారిక సినిమాల్లో బిజీ కావాలని అనుకుంటే మెగా హీరోల సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తాయి. పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ విధంగా కూడా నిహారిక బిజీ అవుతున్నారు.
నిహారిక చైతన్య సోషల్ మీడియా, వెబ్ మీడియా వార్తల గురించి స్పందించి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిహారిక చైతన్య ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీ విడిపోతే మాత్రం ఆ ప్రభావం సమాజంలోని చాలా జంటలపై పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.