గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరగగా అదే సమయంలో ఫ్యాన్ వార్స్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ కళ్లు చెదిరే స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జవాన్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే సలార్ టీజర్ ను మించి జవాన్ ట్రైలర్ కు వ్యూస్ వచ్చాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏంటంటే యూట్యూబ్ లో మాత్రం సలార్ టీజర్ తో పోల్చి చూస్తే జవాన్ ట్రైలర్ కు చాలా అంటే చాలా తక్కువగా వ్యూస్ రావడం గమనార్హం. అయితే ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో (Prabhas) ప్రభాస్, షారుఖ్ ఖాన్ అభిమానుల మధ్య గొడవ జరుగుతోంది.
బాలీవుడ్ హీరోలను మించి సలార్ సినిమా టీజర్ కే వ్యూస్ వచ్చాయి. అటు ప్రభాస్ క్రేజ్ కు ఇటు ప్రశాంత్ నీల్ క్రేజ్ యాడ్ కావడం వల్లే ఈ సినిమా టీజర్ కు ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ లకు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మామూలుగా లేవు. ఈ ఇద్దరు సెలబ్రిటీలకు పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సలార్ మూవీకి కళ్లు చెదిరే స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ రెమ్యునరేషన్ అత్యంత భారీ స్థాయిలో ఉండగా తన ఆటిట్యూడ్ తో ప్రభాస్ ఇతర హీరోల అభిమానుల హృదయాలను సైతం గెలుచుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్న ప్రభాస్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!