Nithiin: నితిన్ మూవీ ఆలస్యానికి సాయితేజ్ కారణమా?

  • August 1, 2022 / 12:44 PM IST

నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగష్టు నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజవుతున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. మాస్ కంటెంట్ తో తెరకెక్కడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం మూవీ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో నితిన్ కు సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రం కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాకు, మాచర్ల నియోజకవర్గం సినిమాకు మధ్య కొన్ని పోలికలు ఉండటంతో ఈ సినిమా కథలో మార్పులు చేశారని సమాచారం. ఆ కారణం వల్లే చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైందని సమాచారం అందుతోంది.

ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నితిన్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే నితిన్ కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఏడాది విక్రమ్ సినిమా ద్వారా నిర్మాతగా కూడా నితిన్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. నితిన్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

రారా రెడ్డీ సాంగ్ కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమైంది. ఈ సినిమాకు పోటీగా కార్తికేయ2 సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రాజెక్ట్ లతో నితిన్ ఖాతాలో సంచలన విజయాలు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా సినిమాసినిమాకు నితిన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus