ఎన్టీఆర్ తల్లి శాలిని.. నాగ శౌర్యకి కాబోయే భార్య అనూష శెట్టి మధ్య బంధుత్వం ఉందా?

  • November 12, 2022 / 11:26 AM IST

ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు నాగ శౌర్య. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో నాగ శౌర్య పెళ్లి జరగబోతుంది. దీంతో అసలు అనూష శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాల పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అనూష శెట్టి బెంగళూరు బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న అనూష శెట్టి…

ప్రస్తుతం డిజైన్స్ ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్ ను నడుపుతోంది.కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన బెంగళూరు బేస్డ్ బిజినెస్మెన్ కుమార్తె ఈమె. 2019 వ సంవత్సరానికి గాను డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకుంది. నాగ శౌర్య – అనూష లది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్, ఏలూరులోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుటుంబానికి కూడా దూరపు బంధువు.

ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. నాగశౌర్య ని అన్నయ్య అని పిలుస్తుంది అని ఓ సందర్భంలో అతనే చెప్పుకొచ్చాడు. ఇదంతా ఒక వైపు అయితే… మరోవైపు ఎన్టీఆర్ తల్లి శాలినికి .. నాగ శౌర్యకి కాబోయే భార్య అనూషకి రిలేషన్ ఉంది అంటూ కొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి.అయితే అందులో నిజం లేదు. కాకపోతే శాలిని గారు.. అనూష ఇద్దరూ కూడా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకి దగ్గరలో ఉన్న కుందాపూర్ కు చెందిన వారు.

అనూష… శెట్టి కుటుంబానికి చెందిన అమ్మాయి కాగా..శాలిని గారు కన్నడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. వీటిలో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ‘కాంతార’ హీరో అయిన రిషబ్ శెట్టి కూడా కుందాపూర్ కు చెందిన వ్యక్తే అని తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus