Nayanthara, Vignesh Shivan: నయనతార.. విగ్నేష్ శివన్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

నయనతార కెరీర్ ప్రారంభంలో వరుసగా గ్లామర్ రోల్స్ తో యూత్ కు నిద్రలేకుండా చేసేది. అలాగే ప్రేమ వ్యవహారాలతో కూడా నిత్యం వార్తల్లో నిలిచేది. మొదట శింబుతో తర్వాత ప్రభుదేవాతో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఓ విధంగా ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కూడా నయనతార అంటూ ప్రభుదేవా మాజీ భార్య పెద్ద ఎత్తున మండిపడింది. ప్రేమ వివాహాన్ని కూడా పెటాకులు చేసిన ఘనత నయనతారది అంటూ ఆమె ఒకానొక సందర్భంలో విరుచుకుపడింది.

ఇక ప్రభుదేవాతో విడిపోయిన కొన్నాళ్ళకి దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ మొదలుపెట్టింది నయన్. వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అసలు పెళ్లి చేసుకుంటారా లేదా? అని కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే విగ్నేష్… నయన్ లు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా డేటింగ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.అప్పుడప్పుడు వీళ్ళ రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.

అయితే నయన్ కి విగ్నేష్ కు ఏజ్ గ్యాప్ ఉండనే సంగతి బహుశా చాలా మందికి తెలిసుండదు. అయితే విగ్నేష్ పెద్దవాడు అని కాదు.నయన్‌ కన్నా విఘ్నేష్‌ 10 నెలలు చిన్నవాడట.ఈ విష‌యాన్ని దర్శకుడు విఘ్నేష్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘నా కంటే న‌య‌న‌తార 10 నెల‌లు పెద్ద‌ద‌ని’ చెప్పుకొచ్చాడు.అయితే పెళ్లి విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేషే చక్కబెడుతున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు ఎప్పుడూ చెబుతుంటాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus