Puri, Siri: స్టార్‌ డైరక్టర్‌ పూరిని బిగ్‌బాస్‌ సిరి అలా పిలిచిందేంటి?

  • March 1, 2023 / 02:05 PM IST

ఈ మధ్య టీవీ షోల్లో, ఓటీటీ షోల్లో… రాసుకొండి, రాసుకొండి.. థంబ్‌నెయిల్స్‌ పెట్టేయండి అంటూ యాంకర్‌లు, గెస్ట్‌లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వాళ్లు ఏమీ అనకుండా రాసుకోవడానికి, థంబ్‌ నెయిల్స్‌ పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి. ఆ విషయం పక్కనపెట్టేస్తే బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న సిరి చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈటీవీలో ‘సుమ అడ్డా’ షోకి ‘పులి మేక’ టీమ్‌లో సభ్యురాలిగా వచ్చిన సిరి చెప్పిన మాటలే ఆ వైరల్‌ అంశాలు.

‘సుమ అడ్డా’ అంటే సుమ వంకర టింకర ప్రశ్నలతో నిండిపోతుంది. అలాంటి ఓ రెండు ప్రశ్నలకు సిరిని సుమ అడిగింది. దానికి సిరి చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. తొలి ప్రశ్నగా సుమ ‘ఒక హీరో ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి అంటే.. ఎవరి సంతకం తీసుకుంటారు. పవన్‌ కల్యాణ్‌దా, మహేష్‌బాబు ఆటోగ్రాఫా’ అని అడిగితే.. దానికి సిరి ‘పవన్‌ కల్యాణ్‌ ఆటోగ్రాఫ్‌’ అని చెబుతుంది. దీంతో షోకి వచ్చినవాళ్లు ‘ఇది థంబ్‌ నెయిల్‌ మేటర్‌’ అని నవ్వేసుకుంటారు.

ఆ తర్వాతే అసలు ప్రశ్న వచ్చింది. వర్క్‌ చేసే ఛాన్స్‌ వస్తే పూరి జగన్నాథ్‌ సినిమాలోనా? లేక సుకుమార్‌ సినిమాలోనా? అని సుమ అడిగితే.. సిరి మాట్లాడుతూ ‘పూరి సర్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. కాబట్టి పూరి మావయ్య సారీ సారీ పూరి సార్‌’ అని చెబుతుంది. దీంతో పూరి జగన్నాథ్‌ను సిరి పూరి మావయ్య అని ఎందుకు పిలిచింది అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. కావాలనే అలా అనిందా? లేక పొరపాటను అనిందా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

అయితే సిరి, పూరి జగన్నాథ్‌.. ఇద్దరిదీ విశాఖపట్నం జిల్లానే. ఆ విధంగా ఒకే ప్రాంతం వాళ్లు కాబట్టి అలా అనిందా? లేక ఇద్దరి మధ్య ఏమైనా చుట్టరికం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మరోసారి సిరి సమాధానమిస్తేనే క్లారిటీ వస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus