Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » “ది రోజ్ విల్లా” ట్రైలర్ దద్దరిల్లిపోయింది.. బొమ్మకూడా బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ విన్నర్ సోహైల్ !!

“ది రోజ్ విల్లా” ట్రైలర్ దద్దరిల్లిపోయింది.. బొమ్మకూడా బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ విన్నర్ సోహైల్ !!

  • January 5, 2021 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ది రోజ్ విల్లా” ట్రైలర్ దద్దరిల్లిపోయింది.. బొమ్మకూడా బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ విన్నర్ సోహైల్ !!

కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ ‘దియా’ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం “ది రోజ్ విల్లా”. శ్వేతా వర్మ హీరోయిన్ గా చిత్ర మందిర్ స్టూడియోస్ పతాకంపై హేమంత్ దర్శకత్వంలో అచ్యుత్ రామారావు పి. ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజరవీంద్ర, అర్చన కుమార్, వెన్నెల రామారావు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం జనవరి 4న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ విన్నర్ సోహైల్ ముఖ్యఅతిధిగా హాజరై “ది రోజ్ విల్లా” ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటి అర్చన కుమార్, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, యాంకర్, నటుడు టి.యన్.ఆర్, కెమెరామెన్ అంజి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, దర్శకుడు హేమంత్, నిర్మాత అచ్యుత రామారావు, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి కొల్లి పాల్గొన్నారు..

ప్రముఖ నటుడు రాజరవీంద్ర మాట్లాడుతూ.. ‘హీరో దీక్షిత్ వెరీ ఫ్యాషనేట్ యాక్టర్. చాలా అద్భుతంగా నటించాడు. అలాగే డాన్సర్, థియేటర్ ఆర్టిస్ట్ అయిన అర్చన కుమార్ చాలా బాగా యాక్ట్ చేసింది. బేసిగ్గా ఆవిడ కన్నడ అయినా కూడా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పారు. ఇక కెమెరామెన్ అంజి సూపర్బ్ విజువల్స్ తో ఎక్స్ట్రార్డినరీ గా వర్క్ చేసాడు. సురేష్ బొబ్బిలి ఔట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. నిర్మాత రామారావు చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద సినిమా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. హేమంత్ ఫస్ట్ సినిమా అయినా చాలా క్లారిటీగా కాన్ఫిడెంట్ తో “దిరోజ్ విల్లా” చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను.. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన రామారావుకు, దర్శకుడు హేమంత్ కి నా థాంక్స్.. అన్నారు.

నటి అర్చనకుమార్ మాట్లాడుతూ.. ‘ ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. హేమంత్ ఎక్సలెంట్ గా ఈ చిత్రాన్ని తీశాడు. రాజారవీంద్ర లాంటి సీనియర్ యాక్టర్ తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సెట్స్ లో ఎన్నో టిప్స్ చెప్పారు. ఈ సినిమా నాకు వన్డ్రఫుల్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. దీక్షిత్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అంజి కెమెరా ముందు ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో చూపించారు.. అన్నారు.

కెమెరామెన్ ‘గరుడవేగ అంజి’ మాట్లాడుతూ..’ నటీనటులు అందరూ ఫెంటాస్టిక్ గా చేశారు. డైరెక్టర్ హేమంత్ పక్కా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆర్టిస్టులు దెగ్గర్నుండి తనకి కావాల్సిన పెర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నారు. సురేష్ బొబ్బిలి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా విజువల్స్ కి తగ్గట్లు ఆర్.ఆర్ ఇచ్చాడు. ఇద్దరం పోటాపోటీగా వర్క్ చేశాం. సినిమా చూసిన వారంతా మా ఇద్దరి వర్క్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. అచ్యుత్ రామారావు మేకింగ్ విషయంలో ఏది అడిగినా ఎక్కడా వెనకాడకుండా అన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ పిల్లర్ రామారావు. మా అందర్నీ ఒక టీమ్ లా ఫామ్ చేసి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. హేమంత్ నేరేట్ చేసిన స్టోరీ చాలా బాగుంది. దానికి తగ్గట్లుగా మ్యూజిక్ చేశాను.. ఈ సినిమా చూసి పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

టి.యన్.ఆర్. మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో ముఖ్యమైన ఒక సింగిల్ సీన్ లో యాక్ట్ చేశాను. దీక్షిత్ ఫ్యూచర్ లో బిగ్ హీరో అవుతాడు. ఇప్పటి వరకూ చూసిన రాజా రవీంద్ర వేరు. ఈ సినిమా తరువాత ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. అంత బాగా ఈ చిత్రంలో చేశాడు. హేమంత్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో తనకంటూ ఒక మార్క్ బ్రాండ్ తెచ్చుకుంటాడు. అంజి, సురేష్ బొబ్బిలి ఇద్దరూ ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చారు. రామారావు ఇంకా రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.. అందులో కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను.. డెఫినెట్ గా ది రోజ్ విల్లా చిత్రం మంచి హిట్ అవుతుంది.. అన్నారు.

చిత్ర దర్శకుడు హేమంత్ మాట్లాడూ.. ‘ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని.. సినిమా ఎలావుందీ అనేది ప్రేక్షకులు చూసి చెప్పాలి. రాజారవీంద్ర ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే హీరో దీక్షిత్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ కథకి ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. నటీనటులు అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ కెమెరామెన్ అంజి. చాలా గ్రాండియర్ గా విజువల్స్ ఇచ్చారు. అలాగే సురేష్ రీ-రికార్డింగ్ చాలా ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. ఒక సెంటిమెంట్ సాంగ్ అద్భుతంగా చేశాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రామారావు, పద్మనాభరెడ్డి గారికి థాంక్స్.. అన్నారు.

ముఖ్య అతిధి సోహైల్ మాట్లాడుతూ.. ‘ ఈ బ్యానర్ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. బిగ్ బాస్ కి ముందు నేను చాలా కష్టాల్లో వున్నప్పుడు రామారావు అన్న నాకు చాలా హెల్ప్ చేసి నాకు బాలీవుడ్ వెబ్ సిరీస్ చేసే అవకాశం ఇచ్చారు. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. యుయస్ లో ఉండి జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోకుండా సినిమా మీద ప్యాషన్ తో వరుసగా ఇక్కడ సినిమాలు స్టార్ట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే బుజ్ బమ్స్ వచ్చాయి.. దద్దరిల్లిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. రామారావు అన్నకి రైట్ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందరితో హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ.. కొత్త ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అవకాశాలు కల్పిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్. ఫస్ట్ మూవీతో చిత్ర మందిర్ స్టూడియో బ్యానర్ లో బిగ్ హిట్ కొట్టబోతున్నారు.. అంజి కెమెరా విజువల్స్ అల్టిమేట్ గా ఉన్నాయి. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసిన ఆ సినిమాకి ప్లస్ అవుతాడు. నా సినిమాలన్నీ ఆయనతోనే చేయాలనుకుంటున్న. సురేష్ ఆర్ ఆర్ ఇరగదీశాడు. రాజరవీంద్ర వన్ మాన్ షోలా చేసాడు. ఐ ఫీస్ట్ లా ఈ సినిమా ఉండబోతుంది. దియా సినిమా నాకు బాగా నచ్చింది. దీక్షిత్ మంచి నటుడు. చాలా తక్కువమంది ఆర్టిస్టులతో సినిమా తీసి బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చాడు హేమంత్. వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.

నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ.. ‘ చిత్ర మందిర్ స్టూడియోస్ పెట్టి సక్సెస్ చేశాం. ఇప్పుడు అదే పేరు తో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మూడు సినిమాలు బాక్ టు బాక్ చేస్తున్నాం. ముందుగా “ది రోజ్ విల్లా” చిత్రం మా బ్యానర్ నుండి వస్తుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతిఒక్కరూ అభిమానంతో ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశారు. వారందరికీ నా థాంక్స్. ఇందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాను. దీక్షిత్ కమిటెడ్ గా పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. అలాగే రాజరవీంద్ర, అర్చనకుమార్, శ్వేతా వర్మ బ్యూటిఫుల్ గా నటించారు. కెమెరామెన్ అంజి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ పెద్ద సినిమా లెవెల్ లో ఈ చిత్రానికి బెస్ట్ ఔట్ ఫుట్ అందించారు. ఇక డైరెక్టర్ హేమంత్ తను అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. తనకి కావాల్సింది ప్రొవైడ్ చేశాం. న్యూ కాన్సెప్ట్ తో మంచి సినిమా చేశాడు. అందరం ఒక ఎమోషన్ లా ఫీలయి వర్క్ చేశాం. మా చిత్రమందిర్ స్టూడియో బ్యానర్ కి సపోర్ట్ గా నిలిచిన సుమన్, మూర్తి లకు నా థాంక్స్. మా బ్యానర్ నుండి వస్తున్న ముగ్గురు మొనగాళ్ళు, టెన్త్ క్లాస్ డైరీ, త్వరలో రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాకి రవితేజ మన్యం వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ సోహైల్ తో ఒక హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాం. దానికి వర్మ దర్శకుడు. శ్రీ విష్ణు, దీక్షిత్ లతో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ..’ కన్నడలో చేసిన “దియా” చిత్రాన్ని భాషా భేదం లేకుండా ఆదరించి సక్సెస్ చేశారు. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా రామారావు కి థాంక్స్. ఒక ప్యాషన్ తో ఎంతో హార్డ్ వర్క్ చేసి హేమంత్ ఈ సినిమా చేశాడు. స్టోరీ అద్భుతంగా నేరేట్ చేసాడు. షూటింగ్ బిగినింగ్ నుండీ సెట్లో ఎలా యాక్ట్ చేయాలో చెప్పి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. కెమెరామెన్ అంజి చాలా ఫాస్ట్ గా క్లారిటీగా ఫినిష్ చేశారు. రాజరవీంద్ర సెట్లో చాలా టిప్స్ ఇచ్చారు. శ్వేతా వర్మ, అర్చన కుమార్ వండర్ ఫుల్ గా నటించారు. సురేష్ ఆర్.ఆర్.బాగా చేశారు. మన సినిమా ఎలా వస్తుంది.. అని ఫోన్ చేసి రామారావును అడిగే వాడ్ని. ఇప్పుడు మీకోసం సినిమాని రెడీ చేసి ఇస్తున్నాం. చూసి ఆదరించి సక్సెస్ చెయాలని కోరుతున్నా.. నేను చిన్నప్పటినుండి తెలుగు సినిమాలు బాగా చూసేవాడ్ని. ఫస్ట్ హ్యాపీ సినిమా చూశాను. తర్వాత అందరి హీరోల సినిమాలు చూశాను. ఎప్పుడూ నేను యాక్టర్ ని అవుతానని అనుకోలేదు. లక్కీగా అయ్యాను. చాలా నెర్వస్ గా ఉంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. అన్నారు.

దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజరవీంద్ర, అర్చనకుమార్, వెన్నెల రామారావు, టి.యన్.ఆర్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; గరుడవేగ అంజి, మ్యూజిక్; సురేష్ బొబ్బిలి, ఎడిటర్; శివ, స్టైలింగ్; శ్రీదేవి కొల్లి, సందీప్ శర్మ, పి.ఆర్.ఓ; వంశీ శేఖర్, యూనిట్; యు అండ్ ఐ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత; అచ్యుత్ రామారావు.పి, రచన-దర్శకత్వం; హేమంత్.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dheekshith Shetty
  • #Hemanth
  • #Swetha Varma
  • #The Rose Villa

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version