Devil Movie: ‘డెవిల్’ వివాదం.. డైరెక్టర్ ఆవేదన!

  • December 27, 2023 / 07:21 PM IST

కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 29 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి. కానీ ‘సలార్’ మేనియాలో ఈ సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘డెవిల్’ విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అందులో మొదటిది డైరెక్టర్ పేరు గురించి అనే చెప్పాలి.

మొదట ఈ సినిమాకు ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారంని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించారు. కానీ అటు తర్వాత ఇతను ఈ ప్రాజెక్టుకి దూరమవుతూ వచ్చాడు. ఇప్పుడు కంప్లీట్ గా పోస్టర్స్ లో ఇతని పేరు కనిపించడం లేదు. డైరెక్టర్ గా నిర్మాత అభిషేక్ నామా పేరే కనిపిస్తుంది. ఈ విషయం పై హీరో కళ్యాణ్ రామ్ ని అడిగినా .. ‘ఆ విషయంలో నిర్మాత క్లారిటీ ఇవ్వాలి’ అంటూ ఎస్కేప్ అయ్యారు.

మరోపక్క ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ ని సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ డైరెక్ట్ చేసినట్టు కూడా కథనాలు పుట్టుకొచ్చాయి. మొత్తానికి ఈ కన్ఫ్యూజన్స్ కి దర్శకుడు నవీన్ మేడారం క్లారిటీ ఇచ్చాడు. తాజాగా అతను ‘డెవిల్’ గురించి ఓ ఎమోషనల్ లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాని ద్వారా అతను స్పందిస్తూ.. ” ఈ సినిమాని ఎంతో శ్రద్ధ పెట్టి చేశాను. దాదాపు 105 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను.కొన్ని ప్యాచ్ వర్క్..ల మినహా మొత్తం సినిమాని నేనే కంప్లీట్ చేశాను.

సినిమా బాగా వచ్చింది. మౌనం చేతకానితనం కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా నా ఆవేదన తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని ఇగోల వల్ల నాకు క్రెడిట్ దక్కడం లేదు. అయితే హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను నా నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాను. ‘డెవిల్’ (Devil) విషయంలో నేను ఎవరిపైనా చర్యలు తీసుకోదలుచుకోలేదు’ అంటూ ఆ లెటర్లో రాసుకొచ్చాడు

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus