Naresh, Pavitra: నరేష్ – పవిత్ర.. ల పెళ్లి వీడియో వెనుక ఉన్న కథ ఇదే..!

  • March 11, 2023 / 12:54 PM IST

నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు అంటూ కొన్ని గంటలుగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం లేకపోలేదు.. పవిత్రని నాలుగో పెళ్లి చేసుకున్నట్టుగా తన ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు సీనియర్ నరేష్. దీంతో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి మీడియా ఆ వీడియోను వైరల్ చేస్తుంది. ‘సైలెంట్ గా నరేష్ నాలుగో పెళ్లి చేసుకున్నాడని, సీక్రెట్ గా పవిత్ర – నరేష్ లు పెళ్లి చేసుకున్నారని, మైసూర్ లో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకున్నారని’ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.

కాదు కాదు చేసేశారు కూడా..!అయితే ఇది నిజం పెళ్లి కాదు అని ఇన్సైడ్ టాక్.’పవిత్ర లోకేష్ కి నరేష్ మూడు ముళ్ళు వేస్తున్నట్లు… ఇద్దరూ కలిసి 7 అడుగులు వేసినట్లుగా ఉన్న వీడియో ఓ సినిమా ప్రచారంలో భాగం అంతే..! ఇంకా టైటిల్ పెట్టని ఆ సినిమాకి యం.యస్.రాజు దర్శకుడని సమాచారం. ఇదిలా ఉండగా.. నరేష్ నాలుగో పెళ్లి కనుక చేసుకుంటే అది చట్ట విరుద్ధం అవుతుంది. ఎందుకంటే నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుండి ఇంకా విడాకులు తీసుకోలేదు.

ఆమె కూడా తన బిడ్డ భవిష్యత్తు కోసం.. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. పైగా మొన్నామధ్య నరేష్ ఇక పెళ్లిళ్ల జోలికి వెళ్ళను అని కూడా చెప్పాడు. అయితే నరేష్ – పవిత్ర కలిసి జీవిస్తున్న మాట నిజం. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా వారికి ఉన్న మాట నిజం. కానీ వాళ్ళు రమ్య విడాకులకు అంగీకరించకుండా పెళ్లి చేసుకోలేరు.

నరేష్ మాత్రం రమ్య నుండి విడాకులు పొందడం కోసం చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి ఆమె గురించి బ్యాడ్ గా చెప్పాడు. రమ్య కూడా వాటిని డిఫెండ్ చేసుకోవడానికి మీడియా ముందుకు వచ్చి నరేష్ బాగోతాలు గురించి వివరించింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus