తాజాగా ‘ఆదిపురుష్’ రిలీజ్ అయ్యింది.ఇందులో హీరోగా అంటే శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించాడు. రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. సీతగా కృతి సనన్ నటించింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. వాల్మీకి రచించిన రామాయణాన్ని .. దర్శకుడు ఓం రౌత్ తనకి నచ్చినట్టు మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలకి అర్ధమయ్యేలా మార్చి తీశాడు. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి.. తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.
అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనే మాట ఒక్కటే. ఇదే సినిమాని రాజమౌళి తీస్తే బాగుండేది కదా అని..! రాజమౌళి ఎందుకు రామాయణాన్ని ముందుగానే తీయలేదు. అలాంటి దర్శకుడు తీస్తే.. ఇప్పటి జనరేషన్ ఇంకా ఎగబడి ఆ చిత్రాన్ని వీక్షించేవారు అని అంతా భావిస్తున్నారు. దీనికి రాజమౌళి గతంలోనే సమాధానం ఇచ్చాడు. ‘బాహుబలి’ టైంలో రాజమౌళి ఈ విషయం స్పందించి క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి మాట్లాడుతూ.. “అమరేంద్ర బాహుబలి పాత్రలో శ్రీరాముని లక్షణాలు ఉంటాయి.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరినీ సినిమా పాత్రల పరంగా చూసుకుంటే.. శ్రీకృష్ణుడి పాత్ర మన కమర్షియల్ సినిమాలకి పక్కాగా సరిపోయే పాత్ర. కానీ శ్రీరాముడి పాత్ర మాత్రం బోరింగ్. ఓకే బ్యార్యతో ఉంటాడు. తండ్రి మాట జవదాటడు.. ధర్మాన్ని పాటిస్తాడు.. సున్నిత మనస్కుడు. ఇవన్నీ మన కమర్షియల్ చిత్రాలకు సరిపోయే లక్షణాలు కావు. అదే శ్రీకృష్ణుడు పాత్ర అద్భుతంగా ఉంటుంది. 20 వేల మంది గోపికలతో రొమాన్స్.. మాయ చేస్తాడు.. ఇలా శ్రీకృష్ణుడు పాత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది.
కానీ శ్రీకృష్ణుడికి ఒక గుడి ఉంటే… శ్రీరాముడికి మాత్రం 50 గుళ్ళు ఉంటాయి. రాముణ్ణి మనం అంతలా ఆరాధించడానికి కారణం ఉంది. వాల్మీకి మహర్షి గారు రామాయణం రాసినప్పుడు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని సున్నితంగా చెబుతూనే రెండు మాస్ క్యారెక్టర్స్ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. వాళ్ళే లక్ష్మణుడు, అంజనేయుడు. ఆ రెండు పాత్రలు మోస్ట్ పవర్ ఫుల్. వాళ్ళిద్దరి శక్తి సామర్థ్యాలని మనం అంచనా వేయలేం.! అలాంటి మాహా పరాక్రమవాంతులే రాముడు కోసం ప్రాణం ఇచ్చేస్తారు.
ఈ అంశంలోనే మనం రాముడికి కనెక్ట్ అయిపోయాం. హనుమంతుడు, లక్ష్మణుడి లక్షణాలే మనకు కూడా వచ్చాయి. శ్రీకృష్ణుడిని ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటామేమో కానీ.. రాముణ్ణి మాత్రం దూషిస్తే మన రక్తం ఉడికిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. సో రాజమౌళి మాటల ప్రకారం.. శ్రీరాముడి పాత్ర అనేది బోరింగ్ అనుకున్నాడు కాబట్టే.. అతను రామాయణం జోలికి పోలేదు. (Rajamouli) రాజమౌళి కనుక ముందుగా రామాయణం తీసుంటే ఓం రౌత్ మాత్రమే కాదు, ఎవ్వరూ కూడా రామాయణాన్ని టచ్ చేసేవారు కాదు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్