నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న మహేష్ బాబు ఫ్యామిలీ పిక్స్..!

సూపర్ స్టార్ కృష్ణ కుటంబం అంతా ఒకే చోట హాజరయ్యారు. ఇంతకీ వారి సడెన్ మీటింగ్ కు కారణం ఏంటి అని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నా.. ఈరోజు మహేష్ బాబు సోదరి అలాగే హీరో సుధీర్ బాబు భార్య అయిన పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు. అందుకే ఈ వేడుకని పురస్కరించుకుని అందరూ సూపర్ స్టార్‌ కృష్ణ గారి ఇంట్లో గేథర్ అయ్యారు.ప్రియతో కేక్‌ కటింగ్ చేయించిన తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు.

సాయంకాలం వరకూ కృష్ణగారి ఇంట్లోనే గడిపి.. ఆఖర్లో ఆయనకు టాటా చెప్పి వెళ్లిపోయారు. ఈ ఫోటోలను హీరో సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ‘ఆ తేదీ రానే వచ్చింది.. నా ప్రేమ ఈరోజే పుట్టింది. హ్యాపీ బర్త్‌ డే ప్రియ’ అంటూ సుధీర్ బాబు ఈ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ ఫొటోల్లో కృష్ణ గారితో పాటు మహేష్ తల్లి ఇందిరా గారు, అలాగే మహేష్ పెదనాన్న ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్‌, అలాగే మంజుల దంపతులు, నమ్రత వంటి వారు కనిపిస్తున్నారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఈ ఫొటోల్లో చాలా యంగ్ గా… అలాగే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలాగే పద్మినీ ప్రియదర్శినికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

3

4

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus