ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కు వర్షం సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చిపెడితే ఛత్రపతి సినిమా భారీగా కలెక్షన్లు సాధించడంతో పాటు మాస్ హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఛత్రపతి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటించిన పౌర్ణమి సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కథ, కథనంలోని లోపాలు ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.
ఛార్మీ, త్రిష పౌర్ణమి సినిమాలో హీరోయిన్లుగా నటించగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాత ఎమ్మెస్ రాజుకు భారీగా నష్టాలు వచ్చాయి. ఈ సినిమా రిలీజైన సమయంలొ ఎమ్మెస్ రాజు, ప్రభుదేవా మధ్య గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ పౌర్ణమి సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తనకు, ప్రభుదేవాకు మధ్య ఎలాంటి గొడవ జరగలేదని ఎమ్మెస్ రాజు చెప్పారు.
ఇప్పటికీ తనకు ప్రభుదేవాకు మధ్య రిలేషన్ బాగానే ఉందని ఎవరో కావాలని పుకార్లను వైరల్ చేశారని ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు. మరోవైపు ఛత్రపతి సినిమా వల్ల పౌర్ణమిపై అంచనాలు భారీగా పెరగడం ఆ సినిమాకు మైనస్ గా మారింది. ఛత్రపతి సినిమా తరువాత కాకుండా వేరే సమయంలో ఈ సినిమా రిలీజై ఉంటే పౌర్ణమి అంత దారుణమైన ఫలితాన్ని అందుకుని ఉండేది కాదని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!