Sudigali Sudheer: లవ్ బ్రేకప్ గురించి ఎమోషనల్ అయిన సుధీర్!

  • May 20, 2022 / 03:43 PM IST

సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర మెగా స్టార్ గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఈయన టీం లీడర్ గా ఎదిగారు.అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా వెండితెర అవకాశాలను అందుకుని దూసుకుపోతున్నారు. ఇకపోతే ఏ కార్యక్రమంలోకి వెళ్ళిన లేదా ఏ వేదికపై అయినా కూడా సుడిగాలి సుదీర్ పెళ్లి ప్రస్తావన వస్తుంది.

తరచూ ఈయన పెళ్లి గురించి ఎన్నో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే సుధీర్ కూడా ఇదివరకు తన లైఫ్ లో తన బ్రేకప్ గురించి చెప్పారు. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా సుధీర్ తన లవ్ బ్రేకప్ గురించి ఎమోషనల్ అయ్యాడు. లవ్ బ్రేకప్ కి సంబంధించిన పర్ఫామెన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన సుధీర్ అనంతరం తన లవ్ బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ విధంగా సుధీర్ తన బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ కావడంతో అక్కడున్న కంటెస్టెంట్ లు, జడ్జి ఇంద్రజ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.కుటుంబ బాధ్యతలు, తన కెరీర్ గురించి చెబుతూ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని తెలియజేశారు. ఒక రకంగా చెప్పాలంటే తన లవ్ బ్రేకప్ తనని నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని, నేను ఇంతటి మంచి అవకాశాలను అందుకొని

ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ అమ్మాయే కారణమని తన ప్రేమ గురించి తలుచుకుని సుధీర్ కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా తన అభిమానులకు కూడా కన్నీళ్లు తెప్పించాడు.ఇలా లవ్ బ్రేకప్ కారణంగా సుధీర్ ఆ బాధను మనసులో పెట్టుకుని ఇన్ని రోజుల వరకు పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున సుదీర్ ను ఓదారుస్తు కామెంట్లు చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus