బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రేస్ టు ఫినాలేకి అడుగులు ముందుకు వేస్తున్నారు హౌస్ మేట్స్. ఇందులో భాగంగా టిక్కెట్ టు ఫినాలే కోసం వివిధ ఛాలెంజస్ లో పోటీ పడుతున్నారు. రకరకాల టాస్క్ లని ఆడుతూ ఫినాలే టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఆదిరెడ్డి టిక్కెట్ టు ఫినాలే గెలిచాడనే న్యూస్ వినిపించింది. కానీ, ఇప్పుడు అది ఫేక్ అని టాక్ వస్తోంది. ఇంకా టాస్క్ నడుస్తోందని, టిక్కెట్ టు ఫినాలే ఆదిరెడ్డి గెలవలేదని అంటున్నారు.
ఫైనాల్ గా శ్రీహాన్ – రేవంత్ – రోహిత్ ముగ్గురికీ ఛాన్స్ లభిస్తోందని టాక్ వినిపిస్తోంది. అనూహ్యంగా శ్రీహాన్ కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయని, ఆదిరెడ్డిని శ్రీహాన్ ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లాడని న్యూస్. అయితే, బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఈ టాస్క్ లు నడుస్తునే ఉన్నాయి. రీసంట్ గా విడుదల అయిన ప్రోమోలో రోల్ బేబీ రోల్ టాస్క్ లో కీర్తి తన అసహనాన్ని ప్రదర్శించింది.
సంచాలక్ గా శ్రీసత్య తీర్పుని తప్పుపడుతూ తను కట్టిన బ్లాక్స్ ని కాల్తో తన్నింది. అంతేకాదు, మీకు ఇష్టమున్నవాళ్లని గెలిపించుకోండి అంటూ మాట్లాడింది. దీంతో కీర్తికి ఇంకా శ్రీసత్య – ఇనయ ఇద్దరికీ పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగినట్లుగా సమాచారం. అంతేకాదు, టాస్క్ లో రేవంత్ కి ఇంకా కీర్తికి కూడా పెద్ద ఫైట్ అయ్యిందని చెప్తున్నారు. ఈ టాస్క్ తర్వాత పాయింట్స్ ని బట్టీ శ్రీహాన్ – రేవంత్ పోటీలో నిలిచినట్లుగా సమాచారం.
ఇక రీసంట్ గా సోషల్ మీడియాలో ఆదిరెడ్డి ఫినాలే టిక్కెట్ గెలిచినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నాడు. అలాగే డేంజర్ జోన్ లో కూడా ఉన్నాడు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ గనక జరిగితే, ఫైమా, శ్రీసత్య, కీర్తి ఇంకా ఆదిరెడ్డి నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.