Venkatesh, Roja: ఆ సినిమా వల్లే.. వెంకటేష్, రోజా మధ్య గ్యాప్ ఏర్పడిందట..!

  • October 1, 2021 / 01:43 PM IST

వివాదాలకు కిలో మీటర్ దూరంలో ఉంటారు మన విక్టరీ వెంకటేష్. పోటీగా ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా.. ఆ స్టార్ హీరోలు అలాగే వారి అభిమానులు కూడా వెంకటేష్ సినిమాలు హిట్టవ్వాలని కోరుకుంటూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదేమో. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి తోటి స్టార్ హీరోలతో ఓ కుటుంబ సభ్యుడిగా మెలుగుతుంటాడు మన వెంకీ మామ. అంతేకాకుండా తెలుగువారందరికీ ఆవకాయ ఎంత ఇష్టమో.. మన వెంకటేష్ కూడా అంతే ఇష్టం’ అంటూ ఈ తరం హీరోలలో ఒకరైన నాని కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

అయితే వెంకటేష్ అంటే పడని ఓ హీరోయిన్ కూడా ఉందట. అంతేకాదు ఆ హీరోయిన్ తో వెంకటేష్ కు 25 ఏళ్ళుగా మాటలు లేవంట. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! ‘వెంకటేష్ అంటే పడని హీరోయిన్ కూడా ఉందా? ఎవరా హీరోయిన్?’ అనే ప్రశ్న ఈ పాటికే మీ మైండ్లో తిరుగుతూ ఉండొచ్చు. ఆమె మరెవరో కాదు రోజా. విషయంలోకి వెళితే.. ‘వెంకటేష్ నటించిన ‘చిన రాయుడు’ చిత్రంలో రోజా హీరోయిన్ గా నటించాల్సి ఉంది.

కానీ దర్శకనిర్మాతల పట్టు వలన ఆ సినిమాలో విజయశాంతిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో రోజా.. వెంకీని నిలదీసిందట. దర్శకనిర్మాతల పట్టువలనే అలా చేయాల్సి వచ్చింది అని వెంకీ చెప్పారట. తర్వాత వీరిద్దరూ కలిసి ‘పోకిరి రాజా’ అనే సినిమాలో నటించారు. ఈ మూవీలో రోజా అయిష్టంగానే నటించిందట. 1995 లో ‘పోకిరి రాజా’ విడుదలైంది. ఈ మూవీ తర్వాత వెంకటేష్, రోజాల మధ్య ఇప్పటివరకు మాటలు లేవట.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus