కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. అజిత్ నటించే సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ‘తెగింపు’ (తమిళంలో తునివు) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. జనవరి 11న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు.
జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా…నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు కలిసి ‘తెగింపు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. కానీ రెండో రోజు ‘వీరసింహారెడ్డి’, మూడో రోజు ‘వాల్తేరు వీరయ్య’, 4వ రోజు ‘వారసుడు’, ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు రావడం..
వస్తుండడంతో ఈ సినిమాని జనాలు పట్టించుకోవడం లేదు.అంతేకాదు థియేటర్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఒకసారి ‘తెగింపు’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.98 cr |
సీడెడ్ | 0.35 cr |
ఆంధ్ర | 0.97 cr |
ఏపీ + తెలంగాణ | 2.27 cr |
‘తెగింపు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు నుండి డల్ అయిపోయింది. ఇక 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.27 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.0.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
టార్గెట్ చిన్నదే అయినా ఈ మూవీకి థియేటర్లు లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ కష్టంగా మారింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఇప్పుడు 52 థియేటర్లలో మాత్రమే రన్ అవుతున్నట్టు ట్రేడ్ పండితుల సమాచారం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?