స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రభాస్ నటించిన బాహుబలి2 సినిమా ఫుల్ రన్ లో 1800 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించగా ప్రస్తుతం సలార్ సినిమా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. చాలా ఏరియాలలో సలార్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది.
700 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటిన రెండు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ మాత్రమే ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఏకైక సౌత్ హీరో అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ అని మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒకటైన ప్రాజెక్ట్ కే ఈ ఏడాది మే నెల 9వ తేదీన రిలీజ్ కానుందని త్వరలో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు ఆ డేట్ సెంటిమెంట్ డేట్ కావడంతో ఆ తేదీనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ పారితోషికం కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.
సంక్రాంతి పండుగ కానుకగా ప్రభాస్ (Prabhas) మారుతి కాంబో సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల కంటే బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. సంక్రాంతి కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నా సలార్ మూవీ చెప్పుకోదగ్గ స్క్రీన్లలో ప్రదర్శితం అవుతోంది. సలార్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!