Directors: హీరోయిన్లను మార్చేసిన స్టార్ డైరెక్టర్… సినిమాలు హిట్ అయ్యేనా?

సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గోపీచంద్ మలినేని ఒకరు. ఇద్దరు డైరెక్టర్లు కూడా ఎంతో మంచి స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు గోపీచంద్ మల్లి నేను తాజాగా బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ సినిమాల విషయంలో ఓ సెంటిమెంటును ఫాలో అవుతూ వస్తున్నారు.

వీరిద్దరు కూడా తమ సినిమాలలో ఓకే హీరోయిన్ పెట్టుకోవడం సెంటిమెంట్ గా భావించారు అయితే ఆ హీరోయిన్స్ నటించిన సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.త్రివిక్రమ్ సినిమాలలో పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. ఇలా గత రెండు సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ కావడం ఆ రెండు సినిమాలు హిట్ కావడం జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం (Directors) వహిస్తున్న సినిమా నుంచి పూజా హెగ్డే తప్పకున్నారు.

ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే గోపీచంద్ మల్లి నేను కూడా తన గత రెండు సినిమాలకు శృతిహాసన్ హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే తాజాగా ఈయన నాలుగో సారి రవితేజ హీరోగా మైత్రి మూవీస్ వారి నిర్మాణంలో మరొక సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ ఉంటుందని అందరూ భావించారు.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ శృతిహాసన్ ను పక్కన పెట్టి మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ఈ ఇద్దరు డైరెక్టర్లు హీరోయిన్ల విషయంలో తమ సెంటిమెంట్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. మరి సెంటిమెంట్ బ్రేక్ చేసినటువంటి ఈ డైరెక్టర్లు హిట్ సినిమాలను అందుకునేరా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus