అనుష్క పక్కనున్న ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తుపట్టండి.. చూద్దాం!

  • December 31, 2022 / 12:12 PM IST

సినిమా రంగంలోకి ఎంటర్ అయినప్పుడు ఎలాంటి అవకాశాలు అయినా స్వీకరించాలి. ఇప్పుడు స్టార్ లుగా రాణిస్తున్న ఎంతో మంది ఒకప్పుడు చిన్న చితక పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన వాళ్ళే. అయితే అందరూ స్టర్లుగా ఎదుగుతారు అన్న గ్యారెంటీ లేదు. అది వాళ్ళ హార్డ్ వర్క్ తో పాటు లక్ పై కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతారు. ఇంకొంతమంది ఒకడుగు ముందుకేసి ఇంకొంచెం ఎదిగి ఆగిపోతారు.

అలాంటి వారి లిస్ట్ లో ఉన్న ఓ బ్యూటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం …! పైన ఉన్న ఫోటోలో అనుష్క పక్కన డాన్స్ వేస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా? చాలా మంది ఈపాటికి కనిపెట్టేసి ఉంటారు. ఆమె మరెవరో కాదు భాను శ్రీ. అవును బిగ్ బాస్ భాను శ్రీ నే..! ఈమె కెరీర్ లో గ్రూప్ డాన్సర్ గా చేసింది. మిర్చి సినిమాలో డార్లింగే పాటలో అనుష్క పక్కన చిందులేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్, కాటమరాయుడు, మహానుభావుడు…

వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. వరుణ్ సందేశ్ వంటి ఫేడౌట్ అయిపోయిన హీరోల సరసన హీరోయిన్ గా కూడా నటించింది. బిగ్ బాస్ సీజన్ 2 లో ఈమె ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఈమె తర్వాత కౌశల్ పై నోరు పారేసుకుని.. ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత బుల్లితెర పై టీవీ షోల్లో పాల్గొంటూ కాలం గడుపుతోంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus