వివాదాస్పద స్వామిజీ నిత్యానందతో పాటు కైలాస దేశానికి వెళ్ళిపోతా అంటుంది తమిళ హీరోయిన్ మీరా మిథున్. నిత్యానంద స్వామిజీ తన భక్తుల కోసం నిర్మించనున్న కైలాస దేశానికి స్వామిజీతో వెళ్లి ఆయనకు సేవలు చేసుకుంటుందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అనేక మార్లు అత్యాచార మరియు ఛీటింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద వివాదాస్పద స్వామిజీగా 2010లో అరెస్ట్ కాబడ్డారు. దాదాపు రెండు నెలలు ఆయన జైలు జీవితం గడిపారు.
అలాగే ఆయన హీరోయిన్ రంజితతో రాసలీలలు జరుపుతున్న వీడియో సైతం బయటికి రావడం జరిగింది. ఆ వీడియోని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగా వీరిద్దరూ కొట్టిపారేశారు. తాజాగా ఆయన ఒక ప్రత్యేక దేశం నిర్మించే ఆలోచనలో ఉన్నారు. కైలాస దేశం అనే ఆ ప్రదేశం తనకు మరియు భక్తులకు ఉద్దేశించింది. దీని కోసం నిత్యానంద ఒక ద్వీపాన్ని కొనుగోలుచేస్తారట.
నిత్యానంద భక్తి ప్రభుత్వంలో కొత్త కరెన్సీ కూడా ముద్రిస్తున్నారు. ఈ దేశానికే మీరా మిథున్ వెళతాను అంటున్నారు. అత్యంత కాంట్రవర్సియల్ నటిగా పేరున్న మీరా మిథున్ కి నిత్యానంద మీద ఎందుకు మనసయ్యిందో అర్థం కావడం లేదు. గతంలో ఈమె కోలీవుడ్ కి చెంది పలువురు ప్రముఖుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.