ఈ శుక్రవారం సినిమాలే సినిమాలు!

మాంచి ఆకలిమీదున్న వ్యక్తి రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాక వెయిటర్ మెల్లగా వచ్చి “సారీ సార్ ఫుడ్ అయిపోయింది” అని చెప్తే ఎంత బాధపడతాడో.. శుక్రవారం వచ్చినప్పుడు థియేటర్లలో సరైన సినిమాలు లేనప్పుడు సగటు సినిమా కూడా అదే స్థాయిలో బాధపడతాడు. గత రెండు వారాలుగా సరైన రిలీజ్ లు లేక బాధపడిన సినిమా అభిమానులకు ఈ వారం పండగే. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగులో “ఏంజెల్, గరుడ వేగ, నెక్స్ట్ నువ్వే”, హిందీలో “ఇత్తేఫాక్”, ఇంగ్లీష్ లో “థోర్” చిత్రాలు ఈ వారం విడుదలవుతున్నాయి. అన్నీ సినిమాలూ వేటికవే విభిన్నమైనవి కావడంతో ఓపికుండాలే కానీ అన్నీ సినిమాలు చూసేయొచ్చు.

యాంగ్రీ మేన్ రాజశేఖర్ హీరోగా రూపొందిన “గరుడ వేగ” ట్రైలర్ చూస్తే మాంచి యాక్షన్ ప్యాక్డ్ ఫిలిమ్ అని అర్ధమవుతుంది. అలాగే.. హెబ్బాపటేల్ టైటిల్ పాత్రలో రూపొందిన “ఏంజెల్” హిలేరియస్ కామెడీతోపాటు వండర్ ఫుల్ విజువల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఇక “నెక్స్ట్ నువ్వే” సినిమా ఈ వారం స్పెషల్ అట్రక్షన్ ఎందుకంటే.. రష్మీ ఈ సినిమాలో మరోమారు తన అందాలతో అలరించిందని మాంచి టాక్. ఇక హిందీ సినిమా “ఇత్తేఫాక్” గురించి బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 1969లో వచ్చిన “ఇత్తేఫాక్”కు రీమేక్ ఇది. ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించడంతో సినిమాపై కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం మరో విశేషం. ఇక ఆంగ్ల చిత్రం “థోర్” గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు జనాలు.. “ఎవెంజర్స్” సిరీస్ సినిమా కావడంతోపాటు ఆల్రెడీ యుకె లో రిలీజయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇండియాలోనూ సినిమా రిలీజ్ కోసం హాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus