Janhvi Kapoor: అలా అయితే జాన్వీకి ఇక్కడ కూడా కష్టమే.!

  • August 5, 2024 / 10:37 PM IST

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి (Sridevi) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. శ్రీదేవి గ్లామర్ గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ ఆమె కెరీర్ ప్రారంభం నుండి కేవలం గ్లామర్ పైనే ఆధారపడలేదు. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ స్టార్ గా ఎదిగింది. శ్రీదేవి నటన గురించి చెప్పుకోవడానికి ‘పదహారేళ్ళ వయసు’ ‘బొబ్బిలి పులి’ ‘క్షణ క్షణం’ (Kshana Kshanam) ‘దేవత’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఆమె సక్సెస్ లో భాగమైంది కూడా అలాంటి సినిమాలే. అయితే ఆమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  మాత్రం నటనపై కంటే పూర్తిగా గ్లామర్ పైనే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి జాన్వీ కపూర్ ముందుగా హిందీ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘దడక్’ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ వంటి సినిమాల్లో నటించింది. అక్కడ ఈమె నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు చేసింది.

అయితే తెలుగులో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ‘దేవర’ (Devara)  సినిమా విషయానికి వస్తే.. పూర్తిగా ఆమె గ్లామర్ పైనే ఆధారపడిందనిపిస్తుంది. తాజాగా ‘దేవర’ నుండి 2వ పాటగా ‘చుట్టమల్లె’ అనే పాట రిలీజ్ అయ్యింది. ఇందులోని విజువల్స్ చూస్తే.. జాన్వీ అందాలతో నిండిపోయాయి. ఎన్టీఆర్ (Jr NTR)  – జాన్వీ..ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు అనిపిస్తుంది. అయితే నటనకు ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తే.. ‘జాన్వీ ఇక్కడ(తెలుగులో) కూడా పెద్దగా రాణించకపోవచ్చు’ అనేది కొందరి అభిప్రాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus