Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న మూవీ మరింత ఆలస్యం కానుందా?

బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు దృష్టించడంతో పాటు తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఫిక్స్ అయినా ఈ సినిమాకు స్టోరీ ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే కన్ఫ్యూజన్ నెలకొంది. మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు 29వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా మహేష్ కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

2023 సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సాధారణంగా మహేష్ బాబు తన ప్రతి సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత కొంతకాలం వెకేషన్ కు వెళతారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పూర్తవడానికి కనీసం 8 నెలల సమయం పడుతుంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావాలంటే మహేష్ అభిమానులకు 2025 సంవత్సరం వరకు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. రాజమౌళి పైకి చెప్పకపోయినా ఈ సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని

ఆయన సైతం ఫిక్స్ అయ్యారని బోగట్టా. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మహేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాలో మహేష్ లుక్ భిన్నంగా ఉంటుందని బోగట్టా.

మహేష్ కు జోడీగా రాజమౌళి ప్రముఖ బాలీవుడ్ నటిని ఈ సినిమాలో ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజమౌళి మహేష్ తో తెరకెక్కించే సినిమా స్క్రీన్ ప్లే మరింత కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus