Samantha: నువ్వు చేస్తుందేంటి సమంత… ఫైర్ అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్!

  • July 13, 2023 / 08:18 PM IST

సాధారణంగా మనం కొన్నిసార్లు సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి గురించి లేదా ఒక సినిమా గురించి చేసే పోస్టులు చేసే వ్యాఖ్యలు తిరిగి మనకే గట్టి షాక్ ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఎదురుదెబ్బ సమంతకు తగిలిందని చెప్పాలి. సమంత గత పది సంవత్సరాల క్రితం మహేష్ బాబుని ఉద్దేశిస్తూ చేసినటువంటి పోస్ట్ గురించి ప్రస్తుతం మహేష్ అభిమానులు సమంత పట్ల దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడు తప్పని చెప్పి ఇప్పుడు నువ్వెలా చేస్తున్నావ్ సమంత అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.

ఇలా మహేష్ బాబు అభిమానుల ట్రోలింగ్ కి సమంత గురి కావడానికి గల కారణం పది సంవత్సరాల క్రితం ఈమె చేసినటువంటి ఒక ట్వీట్ అని చెప్పాలి. మహేష్ బాబు కృతి సనన్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం నెంబర్ వన్ నేనొక్కడినే. ఈ సినిమాలోని ఒక పాటలో మహేష్ బాబు సముద్ర తీరాన నడుచుకుంటూ వెళుతుండగా వెనక కృతి సనన్ ఆయన అడుగులను చేతితో తాకుతూ ఉంటుంది.ఈ పోస్టర్ విడుదల చేయడంతో సమంత తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ అప్పట్లో దుమారపు రేపింది.

సమంత (Samantha) ఇండస్ట్రీకి వచ్చి అప్పటికి ఇంకా మూడు సంవత్సరాలు అయినప్పటికీ మహేష్ బాబు లాంటి స్టార్ విషయంలో తప్పు పట్టడంతో మహేష్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పోస్టర్ ను ఈమె షేర్ చేస్తూ..త్వరలో విడుదల కానున్న ఒక తెలుగు సినిమా పోస్టర్ చాలా అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. ఆ పోస్టర్లోని ఫోజు దాని అర్థం అందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ పోస్ట్ చేశారు. మగాళ్లకు ఆడవాళ్లు బానిసలు అన్నట్లు ఆ పోస్టర్ ఉందనేది సమంత భావన.

స్త్రీ పురుషులు సమానమే, హీరోయిన్ హీరో కాళ్ళను తాకుతున్నట్లు చూపడమేంటీ? అన్నట్లు ఆమె మాట్లాడుతూ చేసినటువంటి పోస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా మహేష్ బాబు అభిమానులు సమంత పై ఆ విషయంలో రివేంజ్ తీర్చుకున్నారని తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఆరాధ్య అనే ఒక సాంగ్ విడుదల చేశారు.

ఇందులో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకునే ఉండగా సమంత ఆయన కాళ్ల వద్ద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మహేష్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు తప్పని చెప్పావ్ మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి సమంత అంటూ భారీగా ఈమెను ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus