Salaar: థియేటర్లు తగ్గినా సలార్ కు ఆ విధంగా లాభమే.. అదే ప్లస్ అంటూ?

  • December 13, 2023 / 07:10 PM IST

సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సలార్ సినిమాకు పోటీగా డంకీ, అక్వా మాన్ థియేటర్లలో రిలీజ్ కానుండగా ఆ సినిమాల వల్ల సలార్ కు సాహో, రాధేశ్యామ్ సినిమాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికాయి. అయితే థియేటర్లు తక్కువైనా సలార్ సినిమాకు మరో విధంగా మేలు జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్ కు థియేటర్లు దక్కినా 90 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యే అవకాశం ఉండటంతో నిర్మాతలు, బయ్యర్లు, థియేటర్ల ఓనర్లకు ప్రయోజనం చేకూరనుంది. నిర్మాత విజయ్ కిరంగదూర్ సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సలార్ సినిమా నుంచి సూరీడే సాంగ్ రిలీజ్ కానుండగా ఈరోజు రిలీజ్ కానున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రశాంత్ నీల్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉంది.

సలార్ (Salaar) సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సలార్2 షూటింగ్ ఇప్పటికే పూర్తైందని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్3 కంటే ముందుగానే సలార్2 సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం ఈ సినిమా బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సలార్ మూవీ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus