చిరంజీవి హీరోగా దానయ్య నిర్మాతగా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ కాగా ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో జోరుమీదున్న చిరంజీవి ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలని దానయ్య భావిస్తున్నట్టు సమాచారం. దానయ్య తన సినీ కెరీర్ లో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలను నిర్మించారు. దానయ్య నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు మెగా హీరోలతో తెరకెక్కగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
వాల్తేరు వీరయ్య సక్సెస్ తో మెగాస్టార్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలుగా ఉంది. చిరంజీవి త్వరలో మూడు నుంచి నాలుగు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు చిరంజీవి సైతం ప్రయోగాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ప్రయోగాత్మక సినిమాలలో నటించడం ద్వారా సక్సెస్ దక్కినా ఆ సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో అనే కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ రీజన్ వల్లే చిరంజీవి ప్రయోగాత్మక సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
మరోవైపు సరైన కథలు దొరికితే మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ను ఏ డైరెక్టర్ సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, సుకుమార్, బోయపాటి శ్రీను ఇలా క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారు. అయితే చిరంజీవి కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మెగాస్టార్ మల్టీస్టారర్స్ లో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?