‘హనుమాన్’ సినిమా స్టేజీ మీద వరలక్ష్మి శరత్ కుమార్‌ను చిరంజీవి తెగ పొగిడేశారు. నిజానికి ఆ పొగడ్తలకు ఆమె అర్హురాలు కూడా. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె నటన అలా ఉంటుంది మరి. అంతేకాదు ఆమె సినిమాలన్నింటిలో ఆమె మార్క్ కనిపిస్తుంది. అయితే ఆ రోజు చిరంజీవి మాట్లాడుతూ ‘నువ్వు ఇక్కడే ఉండమ్మా… టాలీవుడ్లోనే ఉండాలి’ అనేలా మాట్లాడారు. అయితే దాని వెనుక కారణం నెక్స్ట్ తన సినిమాలో నటింపజేసే ఆలోచన ఉండడమేనా? అనే డౌట్ వస్తోంది.
ఎందుకంటే మంచి నటిస్తున్నావ్ అని చెప్పడమే కాకుండా… నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని ఆమెను అడిగాను, అవును అని చెప్పింది. నా ఫ్రెండ్ కూతురు ఇంకా మంచి సినిమాలు చేస్తుంది. అదిరిపోయే పాత్రలు దక్కుతాయి అని చెప్పారు చిరు. అప్పుడు ఏదో క్యాజువల్‌గా అలా అన్నారేమో అనుకున్నారు అంతా. అయితే దాని వెనుక రీజన్ తన నెక్స్ట్ సినిమాలో ఆమె కోసం ఓ పాత్ర సిద్ధం చేస్తున్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఈ మేరకు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
‘క్రాక్’ సినిమాలో జయమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ బీభత్సం మొదలైంది అని చెప్పాలి. అప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఆ పాత్ర ఇచ్చిన హై ఇంకే సినిమా కూడా ఇవ్వేలేదు అని చెప్పాలి. ఇప్పుడు ‘హను – మాన్’తో ఆ బజ్‌ను ఇంకాస్త హైకి తీసుకెళ్లింది వరు శరత్ కుమార్. ఇప్పుడు హాట్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్. ఈ క్రమంలోనే చిరంజీవి – వశిష్ట మల్లిడి సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్‌ను అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ‘విశ్వంభర’లో ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని వశిష్ట అంటున్నారు. ఫాంటసీ డ్రామాతో రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో నటిస్తున్నారు. ఇందులో (Chiranjeevi) చిరు క్యారెక్టర్‌కు మరో పార్శ్వం, పేరు కూడా ఉంటాయి అనేది లేటెస్ట్ టాక్.