Bhagavanth Kesari: బాలయ్య, శ్రీలీల, కాజల్ మాస్ స్టెప్స్.. అంచనాలకు మించి అనేలా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కుతురి పాత్రలో కనిపినించనున్నారు. బాలయ్య థమన్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కాగా ఈ సినిమా కోసం థమన్ అదిరిపోయే మాస్ సాంగ్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాలో కాజల్, శ్రీలీల బాలయ్యతో కలిసి మాస్ స్టెప్స్ వేస్తారని అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఈ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సాంగ్ ను భారీ బడ్జెట్ తో తీశారని ఫ్యాన్స్ ను కచ్చితంగా మెప్పించేలా ఈ సాంగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమా కోసం కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమాకు బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. దసరా కానుకగా అక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాహో గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) టీజర్ ఇప్పటికే విడుదలై సంచలనాలను సృష్టించగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దసరా పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా పైచేయి సాధించే సినిమా మాత్రం ఇదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసి అనిల్ రావిపూడికి భారీ సక్సెస్ ను అందిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus