అతనో యువ కథానాయకుడు.. ఓ అగ్ర కుటుంబానికి చెందిన యువకుడు కూడా. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. సంసారం సోషల్ మీడియా వరకూ అద్భుతంగా ఉంది కానీ.. పర్సనల్ లైఫ్ మాత్రం అంత అందంగా లేదనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అందుకు కారణం ఆ కుర్రాడి భార్య మనోడి మీద అనుమానంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్లనివ్వడం లేదట. ఆఖరికి హీరోగారి అసిస్టెంట్ టీం ను కూడా మచ్చిక చేసుకొని షూటింగ్ టైమ్ లో అప్డేట్స్ అన్నీ తెప్పించుకుంటుందట. దాంతో హీరో బాబు భయభయంగా ఉంటున్నాడట. ఈ విషయమై కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అయినా పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది దాంతో ఏం చేయలేని స్థితిలో సైలెంట్ అయిపోయాడంట కుర్ర హీరో.
దాంతో అమ్మడు ఇంకా రెచ్చిపోవడం మొదలెట్టిందట. ఆఖరికి హీరోగారు ఇచ్చే పర్సనల్ ఇంటర్వ్యూలకు కూడా ఆమె అటెండ్ అవుతూ.. సినిమాలో హీరోతో కలిసి నటించిన హీరోయిన్ ను దగ్గరకి రానివ్వడం లేదట. ఇక హీరోహీరోయిన్ ఇద్దరూ కలిసి ఇచ్చే కాంబినేషన్ ఇంటర్వ్యూకి అయితే.. కెమెరామెన్ పక్కన కూర్చుని మరీ అబ్జర్వ్ చేస్తుందట. దాంతో ఆ ఇంటర్వ్యూల్లో హీరోహీరోయిన్లు ఏదో స్ట్రెంజర్స్ లా బిహేవ్ చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయని దర్శకుడు, నిర్మాతలు మొట్టుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. పాపం భార్య అంతలా అనుమానించడానికి హీరోకి గతంలో పెద్దగా ఎఫైర్లు కూడా ఏమీ లేవు. ఇప్పటివరకూ నటించిన ఏ ఒక్క హీరోయిన్ తోనే మనోడు పెద్దగా బయటకి వెళ్లింది కూడా లేదు. మరి ఆయన సతీమణికి అంత అనుమానం ఎందుకో ఆమెకే తెలియాలి.