బిగ్ బాస్ రియాలిటీ షోలో అన్నింటికంటే ఆసక్తికరమైనది ఎలిమినేషన్ ప్రక్రియే. ప్రతివారం ఒకరు హౌస్ నుంచీ వచ్చేయడం అనేది కామన్. అయితే, సోషల్ మీడియాలో జరిగే అన్ అఫీషియల్ ఓటింగ్ ని బట్టీ చాలామంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది గెస్ చేస్తుంటారు. వీటిని నమ్మద్దని ఎప్పటికప్పుడు బిగ్ బాస్ టీమ్ చెప్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే రవిని ఎలిమినేట్ చేస్తూ షాక్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. ఎవిక్షన్ పాస్ వాడినా , వాడకపోయినా రవి సేఫ్ అయి ఉండాల్సిందంటూ బిగ్ బాస్ వ్యూవర్స్ కామెంట్స్ చేశారు కూడా.
అయితే, ఆఖరివారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి మనం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ఓటింగ్ ని చూసినట్లయితే, టాప్ లో సన్నీకి 34శాతం ఓటింగ్ జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్ లో షణ్ముక్ కి 28శాతం ఓటింగ్ జరిగింది. వీళ్లిద్దరూ విన్నర్ రేస్ లో ముందుకు వెళ్తున్నారు. నువ్వా నేనా అంటూ గత కొన్ని వారాలుగా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలోనే టైటిల్ ఉందని చాలామంది ఊహించేస్తున్నారు. మరోవైపు శ్రీరామ్ చంద్ర, మానస్ లు కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. కానీ, మానస్ ఈవారం సేఫ్ అవుతాడా లేదా అనేది చాలామందికి సందేహంగానే ఉంది.
ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం చూస్తే మానస్ 16శాతం ఓటింగ్ తో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక తర్వాత ప్లేస్ లో సిరి 12 శాతంతో ఉంటే, కాజల్ మాత్రం 10శాతం ఓటింగ్ తో బోటమ్ లో ఉంది. ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా లెక్కప్రకారం చూస్తే కాజల్ ని ఎలిమినేట్ చేయాలి. కానీ, బిగ్ బాస్ అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని నమ్మకండి అంటూ మరోసారి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫస్ట్ నుంచీ కూడా వెబ్ సైట్స్ లో పోలింగ్ ని నమ్మద్దనే ప్రచారం గట్టిగానే చేశారు. లాస్ట్ సీజన్ లో కూడా నాగార్జున స్వయంగా పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అనేది జరుగుతోందని చెప్పారు.
రవిని ఎలిమినేట్ చేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. మరి ఈసారి కాజల్ కాకుండా వేరే ఎవరినైనా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ టీమ్ ట్విస్ట్ ఇవ్వబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. లిస్ట్ లో అయితే కాజల్ తో పాటుగా మానస్ ఇంకా సిరి వీరిద్దరే డేంజర్ లో ఉన్నారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. మరి బిగ్ బాస్ ఇచ్చే ఈ ట్విస్ట్ ఏంటి అనేది తెలియాలంటే ఎలిమినేషన్ వరకూ వెయిట్ చేయాల్సిందే.