బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఎంత రసవత్తరంగా జరుగుతాయో , ఎలిమినేషన్స్ అంతకుమించి ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా వారాలు గడిచేకొద్ది హౌస్ మేట్స్ మద్యలో బాండింగ్ ఉంటుంది కాబట్టి ఒకరిని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి వస్తుంది. ఫస్ట్ వీక్ లోనే సరయు వెళ్లిపోతుంటే విశ్వ చాలా బాధపడ్డాడు. ఇక రెండోవారం ఉమాదేవి విధ్వంసం గురించి మనకి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మూడోవారం ఎవరు హౌస్ నుంచీ వెళ్లిపోతారు అనేది ఆసక్తిగా మారింది. ఓటింగ్ ప్రకారం చూసినట్లయితే, ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు.
ప్రియ – ప్రియాంకసింగ్ – లహరిలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఈవారం ఎలిమినేట్ అవుతారు. ఇక మేల్ కంటెస్టెంట్స్ అయిన మానస్ అండ్ శ్రీరామ్ చంద్ర ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ముఖ్యంగా మానస్ అన్ అఫీషియల్ సైట్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడనే చెప్పాలి. ఇక్కడ ఈవారం ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తిగా మారింది.
ప్రియాంక సింగ్ తో పోలిస్తే ప్రియ ఓటింగ్ లో కాస్త ముందంజలోనే ఉన్నదని అనుకోవచ్చు. అలాగే, ప్రియాంక సింగ్ కి కూడా అభిమానులు బాగానే ఓట్లు వేస్తున్నారు. మిస్ కాల్స్ ఇస్తున్నారు. ఈనేపధ్యంలో ఈ ఇద్దరిలో వెనకబడి ఉంది మాత్రం లహరి అనే చెప్పాలి. అన్ అఫీషియల్ సైట్స్ లో జరిగిన ఓటింగ్ ప్రకారంచూస్తే ఈసారి లహరి ఎలిమినేట్ అవ్వబోతోందనే తెలుస్తోంది. ప్రతి చోటా లహరి లీస్ట్ పొజీషన్ లో కనిపిస్తోంది. మరి అఫీషియల్ ఓటింగ్, మిస్డ్ కాల్ డేటా ఏం చెబుతోంది అనేది చూడాలి. ఒకవేళ ఈవారం ఎలిమినేషన్ లేకపోతే మాత్రం లహరి సేఫ్ అయినట్లే లెక్క. ఈ ఒక్కటే ఇప్పుడు లహరి ముందున్న హోప్ అని చెప్పాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!