బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ లో ఖచ్చితంగా ట్విస్ట్ ఉండబోతోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అసలు మేటర్లోకి వెళితే, ఈవారం నామినేషన్స్ లో మొత్తం 7గురు ఉన్నారు. హౌస్ కెప్టెన్ రేవంత్ కాబట్టి ఈవారం రేస్ లో లేడు. అలాగే, కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. దీందో 7గురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో అన్ అపీషియల్ పోలింగ్ లెక్కల ప్రకారం చూస్తే ఇనయా సుల్తానా టాప్ పొజీషన్ లో ఉంది. ఆ తర్వాత శ్రీహాన్, రోహిత్ ఇద్దరూ కూడా సేఫ్ గానే ఉన్నారు.
ఇక మిగిలిన వాళ్లలోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది. వీళ్లలో శ్రీసత్య, ఫైమా, రాజ్ ఇంకా ఆదిరెడ్డి ఉన్నారు. ఆదిరెడ్డికి ఇంకా రాజ్ కి ఈసారి ఖచ్చితంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకంటే, గత కొన్ని వారాలుగా రాజ్ నామినేషన్స్ లో లేడు. అందుకే ఈసారి ఎలిమినేట్ అవుతాడని హౌస్ మేట్స్ లెక్కలు వేస్తున్నారు. కానీ, ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం ఫైమా లీస్ట్ లో ఉంది. అందరికంటే తక్కువ ఓట్లు ఫైమాకే వస్తున్నాయి. కానీ, ఫైమా దగ్గర ఈవారం సేఫ్ అయ్యేందుకు ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉంది. ఈ పాస్ ఉపయోగిస్తే తనకి తాను సేవ్ అయిపోతుంది.
అప్పుడు కంప్లీట్ గా ఎలిమినేషన్ చేస్తారా.. లేదా ఈవారం ఎలిమినేషన్ ని తీసేస్తారా అనేది బిగ్ బాస్ టీమ్ అప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. శ్రీసత్యకి వాళ్ల మదర్, ఫాదర్ రాకతో మంచి బూస్టింగ్ వచ్చింది. అంతేకాదు, ఓటింగ్ లో కూడా తన పర్సెంటేజ్ ని పెంచుకుంది. దీంతో రాజ్ ని, ఆదిరెడ్డిని ఇద్దరినీ ఓవర్ టేక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఈవారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది. రాజ్ ఇంకా ఆదిరెడ్డి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.
వీకండ్ ఫైమా ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడుకుంటే మాత్రం ఇంకొకరిని హౌస్ నుంచీ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్లలో రాజ్ , ఆదిరెడ్డి ఇద్దరే కనిపిస్తున్నారు. ఇప్పుడు తనకోసం తను వాడుకుని సేఫ్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. అలా కాకుండా రాజ్ ఇంకా ఆదిరెడ్డి ఇద్దరిలో ఒకరికి పాస్ వాడాలంటే మాత్రం ఫైమా రాజ్ ని సేఫ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడు. మరి ఈవారం ఎలిమినేషన్ రౌండ్ లో ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ తో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది చూడాలి.