బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే టాస్క్ లో కీర్తి ఇంకా రోహిత్ ఇద్దరూ కూడా ర్యాంకింగ్స్ లో వెనకబడ్డారు. అయితే, తర్వాత టాస్క్ లో బిగ్ బాస్ పోటీదారులని ఏకాభిప్రాయంతో ఇద్దర్నీ తొలగించమని చెప్పాడు. కానీ, పోటీదారులు దీనికి ఇష్టపడలేదు. ఏకాభిప్రాయానికి రాలేదు. బిగ్ బాస్ ఇదే పనిని సంచాలక్స్ గా ఉన్న శ్రీసత్యకి ఇంకా ఇనయా ఇద్దరికీ అప్పజెప్పాడు. చేసేది లేక ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీసత్య ఇంకా ఇనయా ఇద్దరూ కూడా కీర్తిని ఇంకా రోహిత్ ని తొలగించారు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది.
అయితే, తర్వాత టాస్క్ లో కీర్తి ఇంకా రోహిత్ ఇద్దరూ పార్టిసిపేట్ చేయలేదు. ఈ టాస్క్ తర్వాత పోటీదారులకి బిగ్ బాస్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ పాయింట్స్ పట్టికలో కీర్తి, రోహిత్ లీస్ట్ లో ఉన్నారు. అసలు టాస్క్ ఆడించకుండా పాయింట్స్ ఎలా ఇచ్చారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. టాస్క్ ఆడనివ్వకపోవడం అన్యాయం అని చెప్పి మండిపడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే టాస్క్ లో జెండా టాస్క్ లో కీర్తి 5వ ర్యాంక్ లో, రోహిత్ 6వ ర్యాంక్ లో జెండాని పాతారు.
వీళ్లిద్దరే లీస్ట్ లోకి వచ్చారు. అయితే, ఇక్కడ రేవంత్ ఫస్ట్ ప్లేస్, ఆదిరెడ్డి సెకండ్ ప్లేస్, ఫైమా థర్డ్, ఫోర్త్ శ్రీహాన్ వచ్చారు. వీళ్ల మద్యలోనే పోటీ అనేది నడిచింది. ఈ టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయిన శ్రీసత్య సంచాలక్ గా వ్యవహరించింది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ప్లాస్మాపై డిస్ ప్లే చేశాడు బిగ్ బాస్. ఏకాభిప్రాయంతో ఇద్దరిని తొలగించమని చెప్పాడు. దీంతో కీర్తి ఇంకా రోహిత్ ఇద్దర్నీ తొలగించారు. వాళ్లు గేమ్ ఆడకుండా ర్యాంకింగ్స్ ప్రకారం పాయింట్స్ ని సాధించుకున్నారు.
అయితే, అవి విన్నర్ అవ్వడానికి సరిపోవు. బ్యాలన్స్ టాస్క్ లో ఆదిరెడ్డి నాలుగు పాయింట్స్ సాధించి మొత్తం 9పాయింట్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ స్థానాన్ని అందుకోవాలంటే కీర్తి, రోహిత్ కి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటపుడు వాళ్లని ఆటలో ఎందుకు కంటిన్యూ చేయాలని బిగ్ బాస్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ వీళ్లిద్దరికీ అన్యాయం చేశాడని అంటున్నారు. అంతేకాదు, ఈవారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే వీరిద్దరిలో ఒకర్ని పంపించాలని చూస్తున్నారా..?
ఓటింగ్ లో సేఫ్ జోన్ లో ఉన్నాసరే కావాలని వేరేవాళ్లని సేఫ్ చేయడానికి ఇలా చేస్తున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇస్తే మాత్రం రోహిత్ ఇంకా కీర్తి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫైమా ఆల్రెడీ లీస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమా వెళ్లిపోక తప్పదు. అలాకాకుండా డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫైమాతో పాటుగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. అదీ మేటర్.