This Weekend Movies: ఎఫ్3 తో పాటు ఈ వారం థియేటర్/ ఓటిటిల్లో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

  • May 24, 2022 / 10:43 AM IST

ఫిబ్రవరి 25 న వచ్చిన పవన్ కళ్యాణ్ – రానా ల భీమ్లా నాయక్ నుండీ మే 13 న వచ్చిన సర్కారు వారి పాట వరకు రెండు వారాలకి ఓ పెద్ద సినిమా అన్నట్టు రిలీజ్ అయ్యాయి. రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, కే.జి.ఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. అయితే మధ్యలో చిన్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి. అవి అంతంత మాత్రంగా ఆడాయి. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.సైలెంట్ గా అవి కూడా క్యాష్ చేసుకున్నాయి. ఇక మే ఆఖరి వారంలో కూడా థియేటర్/ ఓటిటిల్లో పెద్ద సందడి షురూ కానుంది. ఒకసారి ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లో విడుదలయ్యే సినిమాలు/ వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:

1) ఎఫ్ 3 : వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ ఎఫ్3. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 27 న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.

2) అశోకవనంలో అర్జున కళ్యాణం : విశక్ సేన్ తనకి కలిగిన మాస్ అండ్ యూత్ లో ఉన్న క్రేజ్ ను పక్కన పెట్టి చేసిన మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. మే 6 న విడుదలైన ఈ చిత్రం బిలో యావరేజ్ వసూళ్ళను సాధించింది. మే 27 న ఈ సినిమా ఆహా లో విడుదల కానుంది.

3) కన్మణి రాంబో కటీజా : విజయ్ సేతుపతి, సమంత, నయన తార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. తెలుగులో ఈ మూవీ డీసెంట్ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ చివరికి ఫ్లాప్ గా మిగిలింది.మే 27 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) ఎటాక్ : జాన్‌ అబ్రహం హీరోగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఎటాక్ 1. ఏప్రిల్‌1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిరాశపరిచింది.అయితే జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి మరి ఇక్కడ ఈ మూవీ ఏమైనా అలరిస్తుందేమో చూడాలి.

5) ఒబీ వ్యాన్‌ కెనోబి : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుండీ స్ట్రీమింగ్ కానుంది.

6) తులసీదాస్‌ జూనియర్‌ : మే 23 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్: మే 23 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) స్ట్రేంజర్‌ థింగ్స్‌ :ఈ సీరీస్ 4వ సీజన్‌ మే 27 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ : ఈ సీరీస్ మే 27 నుండీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) సేత్తుమాన్ : 27 నుండీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) ఫోరెన్సిక్ : ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మే 24 నుండీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

 

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus