Varun Tej, Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి.. ఆ మూడు సినిమాలకు బ్రేక్ వేసిందా?

  • October 31, 2023 / 03:15 PM IST

మెగా ఫ్యామిలీ ప్రస్తుతం వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. నవంబర్ 1 న .. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ల వివాహం ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ ఇటలీ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన భార్యతో కలిసి ఇటలీ పయనమైన సంగతి తెలిసిందే. ఇలా మెగా కుటుంబ సభ్యులు అంతా కూడా ఇటలీలో .. పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇంకో రకంగా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి.

అయితే (Varun Tej) వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి..ల పెళ్లి వల్ల, మెగా అభిమానులు కొంత డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. వరుణ్ తేజ్ – లావణ్య.. ల పెళ్లి వల్ల.. రాంచరణ్ ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల పాటు అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. అయితే అతని నెక్స్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కూడా ఇదే టైంలో జరగాల్సి ఉంది. కానీ చరణ్ లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.

శంకర్ కూడా ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం హైదరాబాద్ రావాలని అనుకున్నాడు. మళ్ళీ అతను ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ కి వెళ్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇంకో నెల రోజులు లేట్ అవుతుంది. అంతే కాదు ‘పుష్ప 2 ‘ షూటింగ్ కి అల్లు అర్జున్, ‘ఓజి’ షూటింగ్ కి పవన్ కళ్యాణ్ కూడా బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus