అసలు రష్మికకు బాలీవుడ్ ప్రొజెక్టే రాలేదంట..!

  • April 27, 2019 / 04:34 PM IST

ఒక్కోసారి హీరోయిన్లు మరియు వారి పి.ఆర్ టీం పబ్లిసిటీ కోసం చేసే కొన్ని పనులు.. వాళ్ళకి పబ్లిసిటీ తీసుకురావడం పక్కన పెడితే, ఒక్కోసారి పరువు తీసేస్తుంటాయి. అలా రష్మిక పరువు తీసేసే సంఘటన ఇటీవల చోటు చేసుకొంది. తెలుగులో ఆల్రెడీ మహేష్ బాబు, అల్లు అర్జున్, అఖిల్, విజయ్ దేవరకొండల సినిమాలతో యమ బిజీగా ఉన్న రష్మికకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయనే వార్తకు కాస్త ఎక్కువ ప్రాచుర్యం లభించాలనే తాపత్రయంతో ఏకంగా బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో రష్మికకు ఆఫర్ వచ్చిందనే వార్తను వ్యాపింపజేశారు.

ఈ వార్త అటు ఇటు తిరిగి సంజయ్ లీలా భన్సాలీ దాకా వెళ్లింది. దాంతో భన్సాలీ టీం మా సినిమాలో రష్మిక నటిస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ప్రకటించాల్సి వచ్చింది. దాంతో రష్మిక & టీం కి పరువు పోయినట్లయింది. అయినా.. చేతినిండా ప్రొజెక్ట్స్ పెట్టుకొని ఇలాంటి అనవసరమైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus