Bigg Boss Telugu 5: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉంటుందా..?

  • December 2, 2021 / 02:46 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం ఎలిమినేషన్ అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతవారం రవి ఎలిమినేట్ అవ్వగానే హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా షాక్ తిన్నారు. అసలు నిజంగానే రవికి ఓట్లు రాలేదా అంటూ బిగ్ బాస్ ని సైతం ప్రశ్నించారు. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఇప్పుడు ఈవారం హౌస్ లో నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్ ఐదుగురు ఉన్నారు. వీళ్లలో అబ్బాయిలు శ్రీరామ్, మానస్ ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అమ్మాయిల విషయానికి వస్తే కాజల్, సిరి, ప్రియాంకలు డేంజర్ జోన్ లో ఉన్నారు.

అందుకే ఇప్పుడు ఈసారి అమ్మాయిలలో ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తిగా మారింది. నిజానికి అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో చూస్తే మాత్రం కాజల్ సిరికంటే, ప్రియాంకకంటే కూడా ముందంజలో ఉంది. కాబట్టి కాజల్ వెళ్లే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది సిరి ఇంకా ప్రియాంక ఇద్దరు మాత్రమే. కానీ, బిగ్ బాస్ ఈసారి రవిని ఎలిమినేట్ చేసినట్లుగానే కాజల్ ని ఎలిమినేట్ చేస్తాడా.. లేదా సిరిని ఎలిమినేట్ చేయబోతున్నాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

నిజానికి ఈసారి ప్రియాంకని ఎలిమినేట్ చేస్తేనే బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఫాలో అవుతున్నట్లుగా అవుతుంది. అలా కాకుండా బిగ్ బాస్ టాప్ 5లో ప్రియాంకని ఉంచాలని అనుకుంటే మాత్రం సిరి లేదా కాజల్ ఇద్దరిలో ఒకర్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేస్తారు. అందుకే, ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే, సిరి ఇంకా ప్రియాంక ఇద్దరిలోనే ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఉంటుందని ఇద్దరిలో ఒక పక్కా ఎలిమినేషన్ అని బిగ్ బాస్ వ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus