మూడు రికార్డులను బద్దలు కొట్టిన జనతా గ్యారేజ్.

  • September 6, 2016 / 11:35 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ  సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయి రికార్డులను బద్దలు కొడుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీగా అభినందనలు అందుకుంటోంది. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలై వారం కాకముందే మూడు రికార్డులను కొల్లగొట్టింది.
01. టాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా 50 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల జాబితాలో రెండో స్థానాన్ని జనతా గ్యారేజ్ దక్కించుకుంది. మొదటి స్థానంలో బాహుబలి ఉంది. జనతా గ్యారేజ్ నాలుగు రోజుల్లో 50 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ సత్తాను చాటింది.
02. అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలక్షన్ మార్క్ దాటిన ఎన్టీఆర్ నాలుగో సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. ఇదివరకు బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలు ఈ మార్క్ ని అధిగమించాయి. ఇలా ఏ తెలుగు హీరో సినిమాలు వరుసగా వసూలు చేయలేదు.
03. గుంటూరు, కృష్ణ, వైజాగ్, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో బాహుబలి పేరిట ఉన్న కలక్షన్ల రికార్డులను జనతా గ్యారేజ్ చెరిపేసింది. ఆ చిత్రం కంటే ఎక్కువ వసూల్ చేసి రికార్డ్ నెలకొల్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus